సారాంశం
రీసెంట్ గా రిలీజ్ అయ్యింది చంద్రముఖి2 సినిమా.. ఈసినిమాపై రకరకాల రివ్యూలు వినిపిస్తున్న టైమ్ లో.. చంద్రముఖి అసలైన హీరో.. సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈమూవీ గురించి ఓ లెటర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
దాదాపు 18 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా.. హరర్ కామెడీ మూవీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది చంద్రముఖి. పి.వాసు డైరెక్ట్ చేసిన మూవీలో జ్యోతిక చంద్రముఖిగా నటించి ఎంతలా భయపెట్టిందో అందరికి తెలిసిందే. అప్పటిలో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇన్నాళ్లు తరువాత ఆ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ని తీసుకు వచ్చాడు దర్శకుడు వాసు. అయితే ఈ మూవీలో హీరోగా రజినీకాంత్ ను తీసుకోవాలి అనుకున్నారు. కాని ఆయన సున్నితంగా తిరస్కరించడంతో.. ఆయనకి బదులు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) ని తీసుకున్నాడు.
ఇక చంద్రముఖిగా జ్యోతిక ప్లేస్ లో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటించింది. అయితే చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ అస్సలు బాలేదు అనే విర్షలు వినిపిస్తున్నాయి. అంతే కాదు పాత చంద్రముఖి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ లో సగం కూడా సాధించలేకపోయింది చంద్రముఖి 2. అయితే రిలీజ్అయ్యి రెండురోజులే కాబట్టి లాంగ్ రన్ లో సినిమా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక ఈమూవీ రివ్యూలు కూడాఅంతంత మాట్రమే అంటు ఇచ్చేశారు. పాత చంద్రముఖి సినిమాను మళ్ళీ తీసి చూపించారు అన్న విమర్ష ఉంది. కాకపోతే.. చంద్రముఖి పాత సినిమాలో ఆమె ఆత్మ మాత్రమే కనిపిస్తుంది.. ఇక ఇందులో రాజుఆత్మ కూడా బయటకు వచ్చి.. ఈరెండు ఆత్మలు తన్నుకోవడమే సినిమా.
ఇక ఈమూవీపై రకరకాల వాదనలువినిపిస్తున్న వేళ.. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈసినిమాపై స్పందించారు. చంద్రముఖి సినిమాపై ఓ లెటర్ రిలీజ్ చేశారు తలైవా. రజినీకాంత్ నుంచి ఒక సర్ప్రైజింగ్ లెటర్ వచ్చింది. ఆ లెటర్ రజిని.. “నా మిత్రుడు వాసు తన బిగ్గెస్ట్ హిట్ చంద్రముఖిని కొత్త యాంగిల్లో, భారీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా సినీ అభిమానులకు చంద్రముఖి 2 ద్వారా అందించాడు. వాసు గారికి, రాఘవ లారెన్స్ గారికి, చిత్రబృందం అందరికీ నా శుభాకాంక్షలు” అంటూ పేర్కొన్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు ఆ లెటర్ ని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.