Asianet News TeluguAsianet News Telugu

పెళ్ళికి ముందు మోసం చేశాడు.. మాజీ ప్రియుడి గురించి సన్నీ లియోన్ షాకింగ్ కామెంట్స్

శృంగార తార సన్నీ లియోన్ గురించి పరిచయం అవసరం లేదు. మొదట అశ్లీల చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలో సన్నీలియోన్ బాలీవుడ్ లో క్రేజీ నటిగా మారింది. 

Sunny Leone recalls his ex boy friend cheating dtr
Author
First Published Apr 6, 2024, 9:25 PM IST

శృంగార తార సన్నీ లియోన్ గురించి పరిచయం అవసరం లేదు. మొదట అశ్లీల చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన సన్నీ లియోన్ ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంది. తక్కువ సమయంలో సన్నీలియోన్ బాలీవుడ్ లో క్రేజీ నటిగా మారింది. తెలుగులో కూడా సన్నీ లియోన్ కొన్ని చిత్రాల్లో నటించింది. 

సన్నీలియోన్ ప్రస్తుతం తన భర్త డేనియల్ వెబర్, పిల్లలతో హ్యాపీగా ఉంది. అయితే డానియల్ వెబర్ కన్నా ముందు సన్నీలియోన్ ఓ వ్యక్తిని ప్రేమించిందట. కానీ అతడి వల్ల లైఫ్ లో మరచిపోలేని బాధని అనుభవించినట్లు సన్నీ లియోన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపింది. 

అతడితో ఎంగేజ్ మెంట్ కూడా అయింది. ఆ తర్వాత అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. నన్ను మోసం చేస్తున్నాడని చాలా బలంగా అనిపించింది. మరో రెండు నెలల్లో మా పెళ్లి ఉంది. పెళ్లి బట్టలు కూడా కొన్నా. కానీ రోజు రోజుకి అతడి ప్రవర్తనలో మార్పు కనిపిస్తూ వచ్చింది. 

ఒక రోజు విసిగిపోయా. నిజాయతీగా చెప్పు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగేశా. అతడు కూడా ఓపెన్ అయ్యాడు.. నీ మీద నాకు ప్రేమ లేదని చెప్పేశాడు. నా హార్ట్ బ్రేక్ అయినట్లు అయింది. అతడి వల్ల చాలా రోజులు మానసికంగా కుంగిపోయినట్లు సన్నీలియోన్ తెలిపింది. 

కానీ దేవుడు నా కోసం మరో అద్భుతం చేశాడు. డేనియల్ వెబర్ ని నా జీవితంలోకి పంపాడు. డేనియల్ నన్ను ప్రేమించడమే కాదు.. నా కష్టాల్లో సైతం తోడున్నాడు. మా అమ్మ నాన్న మరణించినప్పుడు నన్ను నాకు తోడుగా నిలబడింది ఇప్పుడున్న నా భర్తే అంటూ డేనియల్ పై సన్నీలియోన్ ప్రశంసలు కురిపించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios