పోర్న్ స్టార్ సన్నీలియోన్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత మెల్లగా బాలీవుడ్ లో పాగా వేసింది. శృంగార తారగానే కాదు.. నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.

ఓ పక్కన సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ సినిమాల్లో ఐటెం సాంగ్స్ లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది. తెలుగులో కూడా పలు ఐటెం సాంగ్స్ లో నర్తించింది.

తాజాగా ఆమె ఓ ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది. 'లవ్లీ యాక్సిడెంట్' అనే ప్రైవేట్ సాంగ్ వీడియోతో ప్రేక్షకుల ముందుకువచ్చి తన డాన్స్, నటనతో విపరీతంగా ఆకట్టుకుంటోంది. తన అందం, స్టెప్పులతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. గంట గంటకి ఈ వీడియో వ్యూస్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ  వీడియోపై మీరు ఓ లుక్కేయండి!