Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్నెట్ లో బీప్ లేకుండా బూతులు.. ఇకపై కుదరదా..?

బీప్ లేకుండా బూతు డైలాగులను వాడుతున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ కు కూడా సెన్సార్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది

strict guidelines for web series

వెండితెరకు, బుల్లితెరకు సెన్సార్ తప్పనిసరి. దీంతో అశ్లీలత, హింస చూపించాలనుకునే దర్శకులు వెబ్ సిరీస్ బాట పడుతున్నారు. ఇంటర్నెట్ లో ప్రసారమయ్యే ఈ వెబ్ సిరీస్ కు ఇప్పటివరకు సెన్సార్ సమస్యలు లేవు. దీంతో అందులో చూపించే కంటెంట్ కు నియంత్రణ లేకుండా పోతుంది. కనీసం ఒక లిమిట్స్ అనేవి పెట్టుకోకుండా.. స్వేచ్చ పేరుతో శ్రుతిమించిన అశ్లీలత, హింసను చూపిస్తున్నారు.

బీప్ లేకుండా బూతు డైలాగులను వాడుతున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ కు కూడా సెన్సార్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్ కంటెంట్ పై నియంత్రణ లేని కారణంగా మేకర్స్ అదుపుమీరి బూతులను, అశ్లీలతను చూపిస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అలా అని వారి స్వేచ్చను హరించే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు.

తాజాగా విడుదలైన 'సాక్రెడ్ గేమ్స్' వెబ్ సిరీస్ కూడా  వివాదాలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో దివంగత రాజీవ్ గాంధీను తిట్టారని, కొన్ని విషయాలను వక్రీకరించి చూపించారని ఫిర్యాదులు నమోదవుతున్నాయి. ఇప్పుడు అధికారులు తీసుకున్న నిర్ణయం కారణంగా త్వరలోనే ఈ బూతు డైలాగులకు బీప్ పడబోతుందని తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios