Asianet News TeluguAsianet News Telugu

బుల్డోజర్ లాంటి రామ్ పోతినేనితో శ్రీలీల మైండ్ బ్లోయింగ్ సెల్ఫీ.. ఇద్దరూ భలే ఉన్నారుగా

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది.

Sreeleela stunning selfie with Ram Pothineni dtr
Author
First Published Jun 7, 2023, 2:34 PM IST

బెంగుళూరు బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చింది. పెళ్ళిసందD చిత్రంతో పరిచయమైన ఈ కుర్రభామ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ల స్థానాలకు సైతం ఎసరు పెట్టేసింది. ప్రస్తుతం శ్రీలీల పవన్ , మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని ఇలా వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది. 

ధమాకా చిత్రంతో అయితే శ్రీలీల ఒక ఊపు ఊపేసింది అనే చెప్పాలి. డ్యాన్స్, యాక్టింగ్, అందం ఇలా ప్రతి అంశంలో ఆమెకి తిరుగులేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు. సాయి పల్లవికి గట్టి పోటీ అనికూడా అంటున్నారు. 

ధమాకా చిత్రం ఆ రేంజ్ లో హిట్ కావడం వెనుక శ్రీలీల మ్యాజిక్ ఎంతైనా పనిచేసింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం శ్రీలీల.. ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలసి బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. బోయపాటి చిత్రాలలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల రామ్ బర్త్ డే సందర్భమంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో ఆ టీజర్ బాగా వైరల్ అయింది. 

లేటెస్ట్ గా ఈ చిత్ర యూనిట్ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీలీల సోషల్ మీడియాలో రామ్ తో తీసుకున్న సెల్ఫీ పిక్స్ పోస్ట్ చేసింది. రామ్ రగ్గడ్ లుక్ లో బుల్డోజర్ లాగా కనిపిస్తున్నాడు. ఇక శ్రీలీల బ్యూటిఫుల్ స్మైల్ తో మెరుపుతీగలా ఉంది. ఇద్దరూ ఈ పిక్స్ లో భలేగా ఉన్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ షెడ్యూల్ దాదాపుగా పూర్తయింది. నెక్స్ట్ షెడ్యూల్ మాఊరు మైసూరులో జరగనుంది అంటూ శ్రీలీల పోస్ట్ పెట్టింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sreeleela (@sreeleela14)

శ్రీనివాస్ చిత్తూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. అఖండ తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ ఈ మూవీ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు. శ్రీలీల ఈ చిత్రంతో పాటు మహేష్ బాబు గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios