Asianet News TeluguAsianet News Telugu

శృంగారతార బాబిలోనా ఇంట త్రీవ్రవిషాదం, వైరల్ అవుతున్న న్యూస్

ఈమధ్య సినిమా వాళ్ల ఇళ్ళలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారి ఇంటిలో ఎవరో ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. తాజాగా మాజీ శృంగార తార బాబిలోనా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 
 

South Star Actress babilona brother Passed Away JMS
Author
First Published Oct 28, 2023, 9:32 AM IST | Last Updated Oct 28, 2023, 9:32 AM IST

ఈమధ్య సినిమా వాళ్ల ఇళ్ళలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారి ఇంటిలో ఎవరో ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. తాజాగా మాజీ శృంగార తార బాబిలోనా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 

ఆమధ్య వరుసగా సిని తారలు మరణించగా.. ఈమధ్య ఎక్కువగా సినీతారల ఇంట విషాదాలుచోటు చేసుకుంటున్నాయి. దిల్ రాజు తండ్రి, డైరెక్టర్ హరి తండ్రితో పాటు.. కింగ్ నాగార్జున సోదరి కూడా ఈమధ్య మరణించినవారిలో ఉన్నారు. ఇక తాజాగా సౌత్ శృగార తార బాబిలోనా ఇంట ఇలాంటి విషాదమే చోటు చేసుంది. ఆమె సోదరుడు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. 

తాజగా ఒకప్పుడు హాట్ హాట్ సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్న బాబిలోనా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు విఘ్నేష్ కుమార్ అలియాస్ విక్కీ చెన్నైలోని తన నివాసంలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ వార్త ప్రస్తుతం తమిళ సినిమా వర్గాల్లో కలకలంరేపుతోంది. 

విక్కీ వయసు 40 ఏళ్లు. చెన్నైలోని సాలిగ్రామం దశరథపురంలోని అపార్ట్ మెంట్ లో ఆయన కొన్నేళ్లుగా ఒంటరిగా ఉంటున్నారు. విక్కీ మృతి విషయాన్ని ఆయన స్నేహితుడు విరుగంబాక్కం పోలీసులకు సమాచారం అందించాడు. అపార్ట్ మెంట్ కు చేరుకున్న పోలీసులు బెడ్ రూమ్ లో విగతజీవిగా పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. చెన్నైలోని కీల్పాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. 

మరోవైపు విక్కీకి క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. గతంలో అతను పలు నేరాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆయనను వలసరవాక్కంలో పెట్రోలింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో గొడవ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆయన తల్లి ఫిర్యాదుతో ఆయన మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

బాబిలోనా.. ఒకప్పుడు శృంగార తారగా..సౌత్ స్క్రీన్ ను ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా మలయాళ చిత్రపరిశ్రమను  తన అందచందాలతో  కుదిపేసింది బ్యూటీ. ఆమె కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.  ఇప్పటికీ ఆమెకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇదిలావుంచితే, బాబిలోనా అసలు పేరు భాగ్యలక్ష్మి. తెలుగు కుటుంబానికి చెందిన ఆమె శృంగార నటిగా పేరు తెచ్చుకున్నారు. సుందర్ బాబుల్ అనే పారిశ్రామికవేత్తను 2015లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios