బాలు మరణంతో సంగీత లోకం కన్నీళ్లు పెట్టుకుంటుంది. తమ గాన గంధర్వుడి లేని సంగీతం ఓ సంగీతమేనా అంటూ ఆవేదన చెందుతుంది. తోటి గాయకులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. బాలు లేకుండా ఎలా పాడటం అంటూ మహిళా గాయకులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ప్రముఖ గాయకురాలు పి. సుశీల.. బాలు మరణంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 

ఈ మేరకు ఆమె ఓ వీడియో ద్వారా సంతాపం తెలిపారు. `సంగీత ప్రపంచానికి ఎంతో మేలు చేసిన బాలుని మహమ్మారి వెంటాడి వెంటాడి వేధించి తీసుకుపోయింది. కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరి ఆప్తుడిని తీసుకుని పోయిన పెద్ద అగాధంలోకి తోసేసిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులందర్నీ తీరని దుఖ సముద్రంలో ముంచేసింది. ఎస్పీ బాలు మరణం వ్యక్తిగతంగా నాకు పెద్ద దెబ్బ. గుండె ధైర్యం తెచ్చుకుని, విషాదం నుంచి కోలుకోవాలని, అభిమానులకు సూచించాల`న్నారు. 

 

బాలు,  సుశీల కలిసి అనేక ఎవర్‌గ్రీన్‌ సాంగ్ లు పాడారు. ఒకప్పుడు వీరి కాంబినేషన్‌కి మంచి పేరుంది. వీరిద్దరు కలిసి పాడిన పాటలు ఎన్నో సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా రొమాంటిక్‌ సాంగ్‌ బాగా పాపులర్‌ అయ్యాయి.