Asianet News TeluguAsianet News Telugu

`ఆర్‌సీ16`లో శివ రాజ్‌కుమార్‌ పాత్ర ఇదే.. సినిమా బ్యాక్‌ డ్రాప్‌లో చిన్న ట్విస్ట్?

రామ్‌చరణ్‌ నెక్ట్స్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బ్యాక్‌ డ్రాప్‌, శివ రాజ్‌కుమార్‌ పాత్ర లీక్‌ అయ్యింది. 

shiva rajkumar role leak from ram charan rc16 small twist in  movie backdrop ? arj
Author
First Published Feb 14, 2024, 7:33 PM IST | Last Updated Feb 14, 2024, 8:54 PM IST

రామ్‌ చరణ్‌ నెక్ట్స్ `ఉప్పెన` ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీని రా అండ్‌ రస్టిక్‌ కంటెంట్‌ తో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. పెద్ద స్కేల్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని ప్రారంభించేందుకు ప్లాన్‌ జరుగుతుంది. అందుకు సంబంధించిన కాస్టింగ్‌ ఎంపిక చేస్తున్నారు టీమ్‌. సినిమా ఉత్తరాంధ్ర బేస్డ్ గా సాగుతున్న నేపథ్యంలో అక్కడి ఆర్టిస్ట్ లకు ప్రయారిటీ ఇస్తుంది టీమ్‌. 

ఈ సినిమాలో మెయిన్‌ కాస్టింగ్‌ కూడా భారీగానే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల శివరాజ్‌ కుమార్‌ని ఎంపిక చేశారు. ఇటీవల ఆయన మెగాస్టార్‌ని కలిసి పద్మవిభూషణ్‌ వచ్చిన సందర్భంగా అభినందనలు తెలిపారు. కలిసి లంచ్‌ చేశారు. అయితే `ఆర్‌సీ16` పేరుతో రూపొందబోతున్న ఈ మూవీని శివరాజ్‌కుమార్‌ పాత్ర ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ అప్డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

ఇందులో శివ రాజ్‌కుమార్‌ కుస్తీ ట్రైనర్‌గా కనిపించనున్నారట. ఆయనది కుస్తీ మాస్టర్‌ రోల్‌ అని తెలుస్తుంది. కుస్తీలో చాలా మందికి ట్రైనింగ్‌ ఇస్తుంటారట. అందులో రామ్‌ చరణ్‌ కూడా ఉంటారని అంటున్నారు. అయితే ఈ మూవీలో రామ్‌చరణ్‌ కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తాడని, సినిమా కబడ్డీ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందనే ప్రచారం జరిగింది. కానీ మెయిన్‌ కంటెంట్‌ అది కాదని అంటున్నారు. 

సినిమాలో స్పోర్ట్స్ కి సంబంధించిన ఎలిమెంట్లు ఉంటాయి, కానీ మెయిన్‌ స్టోరీ అది కాదని తెలుస్తుంది. కబడ్డీతోపాటు క్రికెట్‌, కుస్తీ టచ్‌ ఉంటుందట. సందర్భాను సారంగం ఆయా స్పోర్ట్స్ ఎలిమెంట్లు వస్తుంటాయని, కానీ అంతకు మించి విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌ స్టోరీ, హై ఆక్టేన్‌ ఎమోషన్స్, యాక్షన్స్ ఉంటాయట. ఇవే సినిమాకి మెయిన్‌ బలం అని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

Also read: వరుసపెట్టి ఆస్తులు కొంటున్న హైపర్ ఆది..పవన్ కళ్యాణ్ తో పోలిక, మొహమాటం లేకుండా చెప్పేశాడు

ఇక ప్రస్తుతం రామ్‌చరణ్‌.. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `గేమ్‌ ఛేంజర్‌` మూవీలో నటిస్తున్నారు. పొలిటికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతుంది. ట్రెండీ పాలిటిక్స్ ని ఇందులో చూపించడంతోపాటు పీరియాడికల్‌ అంశాలు కూడా ఉంటాయట. ఇందులో రామ్‌చరణ్‌ సీఎంగా, ఐఏఎస్‌ అధికారికగా కనిపిస్తారని తెలుస్తుంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తుంది. శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Read more: రష్మి గౌతమ్‌ పోర్న్ సినిమా చేసిందా?.. యూట్యూబ్‌లో ఆ మూవీ చూసి స్వయంగా వివరణ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్‌


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios