Asianet News TeluguAsianet News Telugu

కాఫీ విత్ కరణ్ షోలో కియారా, షాహిద్.. నీ బాడీలో హాట్ గా ఉండే పార్ట్ ఏది, మళ్ళీ శృంగారం గురించే..

బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ జోహార్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షోకి బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, అందాల భామ కియారా అద్వానీ అతిథులుగా హాజరయ్యారు. 

Shahid Kapoor hints Kiara Advani marriage with sidharth malhotra
Author
First Published Aug 22, 2022, 4:07 PM IST

బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ జోహార్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీజన్ 7 ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది. కాఫీ విత్ కరణ్ షోలో శృంగారానికి సంబంధించిన ప్రశ్నలని కరణ్ జోహార్ తప్పకుండా అడుగుతారు. అది కూడా మొహమాటం లేకుండా చాలా బోల్డ్ గా అడిగేస్తారు. ఈ ప్రశ్నలకు కొందరు సెలెబ్రిటీలు ఇబ్బంది పడితే మరికొందరు బోల్డ్ గా సమాధానాలు ఇచ్చారు.  

తాజాగా ఈ షోకి బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, అందాల భామ కియారా అద్వానీ అతిథులుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఈ ఎపిసోడ్ లో కరణ్ జోహార్ మరోసారి శృంగార ప్రశ్నలు సంధించాడు. ఒక వైపు విమర్శలు ఎదురవుతున్నా కరణ్ జోహార్ మాత్రం ఆ ప్రశ్నలు ఆపడం లేదు. పదే పదే శృంగారం గురించి మాట్లాడుతూ.. నటీనటుల నుంచి అలాంటి సమాధానాలే రాబట్టి సెన్సషనలైజ్ చేయాలనీ చూస్తున్నాడు. 

షాహిద్ కపూర్ ని కరణ్ జోహార్ నీ బాడీలో సెక్సీగా అనిపించే ఫీచర్ ఏది అని ప్రశ్నించాడు. దీనితో షాహిద్ కూడా అంతే బోల్డ్ గా బదులిచ్చాడు. అది ఇప్పుడు కెమెరా ముందు కనిపించదు అని తెలిపాడు. 

కియారా అద్వానీ ప్రస్తుతం.. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ప్రేమ గురించి కూడా చర్చ జరిగింది. షాహిద్ కపూర్ అయితే ఆల్మోస్ట్ వీరిద్దరి వివాహాన్ని అధికారికంగా ప్రకటించేశాడు. ఒక పెద్ద ప్రకటన ఈ ఏడాది చివర్లో వెలువడబోతోంది అంటూ షాహిద్.. కియారా, సిద్దార్థ్ మల్హోత్రా వివాహం గురించి హింట్ ఇచ్చాడు. కియారా మాత్రం తాను సిద్ధార్థ్ తో రిలేషన్ లేదని కానీ ఉందని కానీ చెప్పడం లేదు అంటూ దాటవేసింది. అతడు తనకి స్నేహితుడు కన్నా ఎక్కువే అని సిగ్గుపడుతూ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios