MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నమ్రత శిరోద్కర్‌ని మిస్‌ ఇండియా యూనివర్స్ పోటీల్లో చూశారా?.. బాబోయ్‌ మతిపోవాల్సిందే.. రేర్‌ వీడియో

నమ్రత శిరోద్కర్‌ని మిస్‌ ఇండియా యూనివర్స్ పోటీల్లో చూశారా?.. బాబోయ్‌ మతిపోవాల్సిందే.. రేర్‌ వీడియో

నమ్రత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె కెరీర్‌ మోడల్‌గా ప్రారంభమైంది. మోడల్‌గా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. దానికి సంబంధించిన రేర్‌ వీడియో వైరల్‌ అవుతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 02 2024, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మాజీ అందాల తార, నటి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌ చేసింది. అందాల పోటీల్లోనూ పాల్గొంది. మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గానూ నిలిచింది. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌ని ఊపేసింది. వెంటనే మ్యారేజ్‌ చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయ్యింది. 
 

28

`వంశీ` సినిమా సమయంలో మహేష్‌బాబు.. నమ్రత అందానికి, ఆమె మంచి మనసుకి పడిపోయాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్పారు. తండ్రి కృష్ణ కి చెబితే మరోసారి ఆలోచించుకోమన్నాడట. అయితే ఆయన మొదట అంగీకరించలేదనే వార్తలు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు మహేష్‌.. నమ్రతని పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు గౌతమ్‌, కూతురు సితార ఉన్నారు. ఇప్పుడు సితార చైల్డ్ సెన్సేషనగా మారిన విసయం తెలిసిందే. 
 

38
Namrata Shirodkar

Namrata Shirodkar

ప్రస్తుతం నమ్రత సినిమాలకు దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలు మానేసింది. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. మహేష్‌ బాబుకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆమెనే దగ్గరుండి చూసుకుంటుంది. మహేష్‌ కాల్షీట్లు, పారితోషికం, యాడ్స్, బిజినెస్‌లు, ఇతర ఫ్యామిలీ వ్యవహారాల్లో కూడా తనే ఇన్‌వాల్వ్ అవుతుంది. అన్నింటిని బ్యాలెన్స్ చేస్తుంది. మహేష్‌ బాబు వరకు రాకుండా కూల్‌గా డీల్‌ చేస్తుంది. 
 

48

ఇదిలా ఉంటే తాజాగా నమ్రతకి సంబంధించిన ఓ అరుదైన వీడియో వైరల్‌ అవుతుంది. ఆమె 1993లో మిస్‌ ఇండియా యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ అరుదైన వీడియో బయటకు రావడం ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో నమ్రత అభిమానులను హ్యాపీ చేస్తుంది. 
 

58

దాదాపు ముప్పై ఏళ్ల క్రితం నమ్రత ఎలా ఉందో ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తుంది. ఆమె అందానికి ఇది ప్రతిబింబంగా నిలుస్తుంది. ఇందులో నమ్రత స్విమ్‌ సూట్‌లో కనిపిస్తుంది. చాలా హైట్‌గా, నాజుకుగా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా అందమే కాదు, హాట్‌గానూ ఉంది. చాలా చురుకుగా కనిపిస్తుంది. 

68

అందాల పోటీల్లో ఆమె వాక్‌ చేస్తూ వచ్చింది. వివిధ స్టెప్స్ పై నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇలా తన అందాల ప్రదర్శన చేస్తూ వయ్యారంగా నడుస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ ఆకట్టుకుంటూ వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన పిక్స్ కూడా హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 

78

1993లో ఫెమినా మిస్‌ ఇండియాలో టైటిల్‌ విన్నర్‌గా నిలవగా, ఫెమినా మిస్‌ యూనివర్స్ లో ఆరవ స్థానంలో నిలిచింది. దీంతోపాటు మిస్‌ ఏసియా పసిఫిక్‌ అందాల పోటీల్లో ఆమె ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. మొత్తంగా అందగత్తె పేరు తెచ్చుకుంది.  
 

88
Namrata Shirodkar

Namrata Shirodkar

1998లో `మేరే డో అన్మోల్‌ రెటన్‌` చిత్రంతో హీరోయిన్‌గా బాలీవుడ్‌కి పరిచయం అయ్యింది నమ్రత శిరోద్కర్‌. `వంశీ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ప్రేమించుకున్నారు. తెలుగులో `వంశీ`తోపాటు కేవలం చిరంజీవి `అంజి`లోనే మెరిసింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. హిందీలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉంది నమ్రత. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Recommended image2
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Recommended image3
Balakrishna: చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలకృష్ణకు ప్రాణం.. ఇంతకీ ఆ మూవీ ఏదంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved