ఈ రాశుల వారు సోమరి భర్తలు
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఒక్కో రాశివారికి ఒక్కో రకమైన లక్షణాలను ఉంటాయి. అయితే కొన్ని రాశుల భర్తలు సోమరిగా ఉంటారని జ్యోతిష్యం శాస్త్రం చెబుతోంది. ఆ రాశుల వారు ఎవరెవరంటే?
కొంతమంది ఎప్పుడూ సోమరిగా ఉంటారు. ఏ పనిచెప్పినా చేయరు. జ్యోతిష్క శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల భర్తలు ఇలాగే ఉంటారు. ఇలాంటి సోమరి భర్తలతో భార్యలు బాగా విసిగిపోతారు. ఇలాంటి వారు బాధ్యతాయుతమైన పని అని ఎన్ని సార్లు చెప్పినా దానిని లెక్క చేయరు. ఆ విషయం గురించి పట్టించుకోర. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఆ రాశుల వారు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వృషభ రాశి
సోమరి భర్తల జాబితాలో వృషభ రాశి వాళ్లు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఈ రాశివారు ఇంట్లో ఏ ఒక్క పని కూడా చేయరు. వీరికి చిన్న పనిచెప్పినా బద్దంగా ఉంటారు. చేయనంటే చేయనని తెగేసి చెప్తారు. వీళ్లు ఇంటి బాధ్యతను కూడా తీసుకోరు. ఈ రాశుల వారిని పెళ్లి చేసుకుంటే భార్యలు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సింహ రాశి
ఈ రాశివారికి ఇంటి బాధ్యతల గురించి అవసరం లేదు. వీళ్లకు ఏదైనా పనిని అప్పగిస్తే వీళ్లు దానికి వేరేవారికి అప్పగిస్తారు. మీరు ఈ రాశిని పెళ్లి చేసుకుంటే.. అన్ని పనులను మీరే చేయాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్లను ఏదీ ఆశించకుండా ఉండాలి. వీరి నుంచి ప్రేమను కూడా ఆశించొద్దని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ధనుస్సు రాశి
ఈ రాశివారిని సోమరితనంలో ఎవ్వరూ మించలేరు. వీళ్లు తమపై మోపిన బాధ్యతల నుంచి వీలైనంత తొందరగా బయటపడాలనుకుంటారు. వీళ్లు పనులు చేయడానికి అస్సలు సిద్దంగా ఉండరు. మీరు ఈ రాశిని పెళ్లి చేసుకున్నట్టైతే.. వారు కొన్నిసార్లు మిమ్మల్ని విస్మరిస్తున్నారని కూడా మీకు అనిపించొచ్చు.
మీన రాశి
ఈ రాశి భర్తలు ఒక రేఖ మధ్యలో ఉంటారు. వీరు చాలా బద్దకస్తులు. అలాగే సోమరిగా ఉంటారు. ఈ రాశి వారిని పెళ్లి చేసుకుంటే మీరు జీవితంలో వారితో ఆచరణాత్మకంగా జీవించాలి. ఎందుకంటే వీరు ఏ పనీ చేయరు. ఏది చెప్పినా దానికి కేర్ చేయరు. సోమరితనంలో వీరే ముందుంటారు.