Asianet News TeluguAsianet News Telugu

'ఉషాపరిణయం' ఐటెం సాంగ్ కి త్రివిక్రమ్ ఫిదా..గాల్లో తేలిపోతున్న హీరోయిన్

టాలీవుడ్ లో దర్శకుడు కె విజయ భాస్కర్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు విజయ భాస్కర్ నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారు. 

seerat Kapoor on cloud nine after trivikram srinivas compliment dtr
Author
First Published Jul 20, 2024, 8:25 PM IST | Last Updated Jul 20, 2024, 8:25 PM IST

టాలీవుడ్ లో దర్శకుడు కె విజయ భాస్కర్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు విజయ భాస్కర్ నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించారు. విజయ భాస్కర్ తో ఎక్కువ కాలం త్రివిక్రమ్ పనిచేశారు. త్రివిక్రమ్ రచయితగా అద్భుతమైన డైలాగులు అందించారు. దీనితో త్రివిక్రమ్, విజయ భాస్కర్ మధ్య మంచి స్నేహం నెలకొంది. 

ఆ తర్వాత విజయ భాస్కర్ చిత్రాలు అంతగా వర్కౌట్ కాలేదు. తివిక్రమ్ మాత్రం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత విజయభాస్కర్ మళ్ళీ మెగా ఫోన్ పట్టారు. తన సొంత నిర్మాణం, దర్శతకంలోనే తన కొడుకు శ్రీకమల్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు. శ్రీకమల్, తెలుగు హీరోయిన్ ఆకాంక్ష జంటగా ఉషాపరిణయం అనే చిత్రంలో నటిస్తున్నారు. 

రీసెంట్ గా ఈ చిత్రంలో డైరెక్టర్ విజయభాస్కర్ ఓ ఐటెం సాంగ్ ని షూట్ చేశారు. ఐటెం సాంగ్ లో హాట్ బ్యూటీ సీరత్ కపూర్ ఆడిపాడింది. షూటింగ్ చివరి రోజు తన ఫ్రెండ్ కోసం త్రివిక్రమ్ సెట్స్ కి వెళ్లారు. ఐటెం సాంగ్ చిత్రీకరణని గమనించారు. చిత్ర యూనిట్ తోపాటు, సీరత్ కపూర్ ని త్రివిక్రమ్ ప్రత్యేకంగా అభినందించారు. దీనితో సీరత్ కపూర్ గాల్లో తేలిపోతోంది. 

 

సీరత్ కపూర్ త్రివిక్రమ్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. త్రివిక్రమ్ సర్ ఈ రోజు సెట్స్ కి రావడం అందరికి సర్ప్రైజ్. ఆయన నా డ్యాన్స్ ని క్లోజ్ గా గమనించి అభినందించారు అంటూ గాల్లో తేలిపోతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios