Asianet News TeluguAsianet News Telugu

యుద్దంలో నువ్వే విజేతవి..సంజయ్‌ స్నేహితుడి పోస్ట్ కి ఫ్యాన్స్‌ కన్నీరు..

తాజాగా సంజయ్‌ దత్‌ బాల్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు పరేష్‌ ఘెలాని స్పందించారు. స్నేహితుడి కష్టాన్ని గురించి, చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాదు సంజయ్‌లో నూతనొత్తేజాన్ని నింపాడు. పోరాడే పటిమని నూరిపోశాడు. మొత్తానికి యుద్ధంలో పోరాడమని, వార్‌లో విన్నర్‌ నువ్వే అని తెలిపాడు. 

sanjay dutt friend paresh ghelani tearfull post on instagram
Author
Hyderabad, First Published Aug 17, 2020, 2:43 PM IST

బాలీవుడ్‌ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్ లండ్‌ కాన్సర్‌తో బాధపడుతున్నట్టు ఇటీవల వైద్యులు నిర్ధారించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమాన లోకమంతా కన్నీరు మున్నీరవుతున్నారు. బాలీవుడ్‌ సైతం విచారం వ్యక్తం చేసింది. సంజయ్‌ జీవితంలో అన్నీ పోరాటాలే అంటూ, ఆయన జీవితంలో ఓ రోలర్‌ కోస్టర్‌ అంటూ భావోద్వేగ ట్వీట్లు చేస్తూ మున్నాభాయ్‌కి మద్దతుగా నిలుస్తున్నాయి. 

సంజయ్‌ కొన్ని ఏళ్ళపాటు జైల్లు జీవితాన్నిఅనుభవించాడు. ఇటీవల జైలు నుంచి విడుదలై తిరిగి సినిమాలతో బిజీ అయ్యాడు. నటుడిగా మళ్ళీ తన సత్తా ఏంటో చూపించాలని సిద్ధమయ్యాడు. ప్రస్తుతం పలు భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ ఇంతలో ఆయనకు కాన్సర్‌ అని గుండెల్లో పెద్ద బండ వేసేంతటి వార్తని వైద్యులు తెలిపారు. దీంతో  మరోసారి కుంగిపోయాడు. ఆయన భార్య మాన్యతా దత్‌ దేవుడు మరోసారి పరీక్షించేందుకు మమ్మల్ని ఎంచుకున్నాడని తెలిపింది. చిరంజీవి పోరాడటం నీ బ్లడ్‌లోనే ఉందని ఉత్తేజాన్ని, మనో స్థైర్యాన్ని నింపాడు. 

తాజాగా సంజయ్‌ దత్‌ బాల్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు పరేష్‌ ఘెలాని స్పందించారు. స్నేహితుడి కష్టాన్ని గురించి, చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అంతేకాదు సంజయ్‌లో నూతనొత్తేజాన్ని నింపాడు. పోరాడే పటిమని నూరిపోశాడు. మొత్తానికి యుద్ధంలో పోరాడమని, వార్‌లో విన్నర్‌ నువ్వే అని తెలిపాడు. 

ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందిస్తూ, బ్రదర్‌ సంజయ్‌.. జీవితంలో తర్వాతి దశను ఎలా ఆస్వాధించడం గురించి ఇటీవలే మనం ఊహించుకున్నాం. ఇప్పటి వరకు  నడవగలిగినందుకు, జాగింగ్‌ చేయగలిగినందుకు, ప్రయాణించగలిగినందుకు, క్రాల్‌ చేయగలిగినందుకు ఎంతో అదృష్టవంతులమని అనుకున్నాం. జీవితాన్ని ఎలా స్వాధించామో మాట్లాడుకున్నాం. భవిష్యత్‌ కూడా ఇంతే ఆనందంగా, కలర్‌ఫుల్‌గా ఉంటుందని నమ్ముతున్నా. మనం ఇప్పటికే అమ్యూజ్‌మెంట్‌ పార్క్ అంతా తిరిగేశామని అనుకున్నాం. కానీ మనం ఇంకా చూడాల్సింది ఉంది. మరో రోలర్‌ కోస్టర్‌ రైడ్‌కి రెడీ అవ్వాలి. మరో యుద్ధాన్ని స్టార్ట్ చేయాలి. నీ మనోస్థైర్యం గురించి నాకు బాగా తెలుసు. నువ్వు కచ్చితంగా గెలుస్తావ్‌` అని పరేష్‌ తెలిపారు. పరేష్‌ పోస్ట్‌కి సంజయ్‌ అభిమానులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. 

ప్రస్తుతం సంజయ్‌ దత్‌ హిందీలో `సడక్‌ 2`, `శంషేరా`, `భుజ్‌ః ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా`, `పృథ్వీరాజ్‌`, `టోర్బాజ్‌`, కన్నడలో `కేజీఎఫ్‌2` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios