Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్... కొంతకాలం మేకప్ వేసుకోను అంటున్న సమంత

11ఏళ్ల సినిమా ప్రయాణంలో ఎప్పుడూ బ్రేక్ తీసుకోలేదని,ఇప్పుడు కొంతకాలం విరామం తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు. ఇకపై కొత్త సినిమాలపై సైన్ చేయనని సమంత ఓపెన్ గా చెప్పేశారు.

samantha announces break for movies fans in shock
Author
Hyderabad, First Published Aug 25, 2021, 11:39 PM IST

సమంత పరిశ్రమకు పరిచయమై 11ఏళ్ళు కావస్తుంది. 2010లో విడుదలైన ఏమాయ చేశావే చిత్రంతో మొదలైన సమంత ప్రస్థానం దశాబ్దానికి పైగా నిర్విరామంగా సాగుతుంది. స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న సమంత ఫ్యాన్స్ కి ఓ షాక్ ఇచ్చింది. కొన్నాళ్ళు ఆమె సినిమాలు చేయనంటూ బాంబు పేల్చింది. 


11ఏళ్ల సినిమా ప్రయాణంలో ఎప్పుడూ బ్రేక్ తీసుకోలేదని,ఇప్పుడు కొంతకాలం విరామం తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలియజేశారు. ఇకపై కొత్త సినిమాలపై సైన్ చేయనని సమంత ఓపెన్ గా చెప్పేశారు. సమంత సిల్వర్ స్క్రీన్ కి తాత్కాలికంగా దూరం కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తుంది. 

ఇక సమంత ఈ నిర్ణయం వెనుక బలమైన కారణమే ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బహుశా సమంత గర్భం దాల్చి ఉంటారని లేదా, గర్భం దాల్చడం కోసం విరామం తీసుకుని ఉంటారని అంచనాలు వేస్తున్నారు. 

2017లో చైతూను వివాహం చేసుకున్న సమంత, పిల్లల కోసం ప్లాన్ చేయలేదు. పెళ్ళై నాలుగేళ్ళ తరువాత సమంత చైతు ఆ దిశగా అడుగులు వేస్తున్నారేమో అనిపిస్తుంది. మరో వైపు సమంత నటించిన పాన్ ఇండియా మూవీ శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే మరో తమిళ చిత్రంలో సమంత నటిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios