Asianet News TeluguAsianet News Telugu

సమంత ఫోటో: కాదేది వైరల్ చేయడానికి అనర్హం!

తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఫోటో వైరల్‌ గా మారింది. ఈ మధ్యే రానా పెళ్లిలో ఓ రేంజ్‌లో గ్లామర్‌ షో చేసిన సమంత తాజాగా తన చెవిదిద్దులకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొత్త చెవి దిద్దులు అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది సామ్‌. అందులో ఆమె చెవికి ఐదు దిద్దులు పెట్టి ఉన్నాయి.

Samantha Akkineni new ear piercings photo viral
Author
Hyderabad, First Published Aug 19, 2020, 3:05 PM IST

కరోన కారణంగా వినోద పరిశ్రమ పూర్తిగా స్తంబించిపోయింది. సీరియల్స్‌ షూటింగ్‌లు ప్రసారాలు జరుగుతున్నా సినిమాలు మాత్రం ఇప్పట్లో స్టార్ట్‌ అయ్యే సూచనలు కూడా కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో సినీ తారలకు సంబంధించి వార్తలు కూడా అరుదుగా మీడియాలో వినిపిస్తున్నాయి. దీంతో తమ అభిమాన తారలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయాన్ని ఓ రేంజ్‌లో వైరల్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

Also Read: పడుకుంటేనే యాక్టింగ్ ఛాన్స్‌.. ఇండస్ట్రీలో దారుణాలపై హీరోయిన్‌ కామెంట్

తాజాగా అలాంటిదే సమంతకు సంబంధించిన ఓ ఫోటో వైరల్‌ గా మారింది. ఈ మధ్యే రానా పెళ్లిలో ఓ రేంజ్‌లో గ్లామర్‌ షో చేసిన సమంత తాజాగా తన చెవిదిద్దులకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొత్త చెవి దిద్దులు అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేసింది సామ్‌. అందులో ఆమె చెవికి ఐదు దిద్దులు పెట్టి ఉన్నాయి. అంతా ఇంట్రస్టింగ్‌ ఫోటో ఏం కాకపోయినా అభిమానులు మాత్రం ఈ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.

Also Read: చాలా మందితో డేటింగ్ చేశా.. ఇప్పుడు సరైనోడు దొరికాడు: తాప్సీ

స్టోన్స్‌తో రూపొందించిన ఈ స్టడ్స్‌కు మహిళలు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటోను ఇప్పటికే 10 లక్షల మందికి పైగా లైక్‌ చేయటం విశేషం. ఇక 4 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి. సినిమాల విషయానికి వస్తే ఓ బేబీ తరువాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది సమంత. ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌2 తో డిజిటల్‌ రంగంలోకి కూడా అడుగుపెట్టింది సమంత.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

New piercings 😎

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Aug 17, 2020 at 11:24pm PDT

Follow Us:
Download App:
  • android
  • ios