Asianet News TeluguAsianet News Telugu

మెగాహీరో సిక్స్ ప్యాక్ తిప్పలు.. మామయ్య స్పెషల్ టిప్స్!

 

ఇప్పుడు హీరోలంతా సిక్స్ ప్యాక్ లతో స్టిఫ్ గా కనపడుతున్నారు. ఎవరైనా సిక్స్ ప్యాక్ లో లేకపోతే వాళ్లు హీరోలే కాదన్న పరిస్దితిగా చూస్తున్నారు. దాంతో యంగ్ హీరోలంతా రాత్రింబవళ్లూ జిమ్ లలో పడి తమ కండల దుమ్ము దులుపుతున్నారు.

Sai Tej hired a fitness trainer for six pack
Author
Hyderabad, First Published Apr 11, 2019, 7:53 AM IST

ఇప్పుడు హీరోలంతా సిక్స్ ప్యాక్ లతో స్టిఫ్ గా కనపడుతున్నారు. ఎవరైనా సిక్స్ ప్యాక్ లో లేకపోతే వాళ్లు హీరోలే కాదన్న పరిస్దితిగా చూస్తున్నారు. దాంతో యంగ్ హీరోలంతా రాత్రింబవళ్లూ జిమ్ లలో పడి తమ కండల దుమ్ము దులుపుతున్నారు. డైటింగ్స్ తో తమ పొట్టమార్చుకుంటున్నారు. అయితే ఇదంతా కెరీర్ కోసమే కాబట్టి కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు సాయి ధరమ్ తేజ వంతు వచ్చింది. ఆయన సిక్స్ ప్యాక్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. 

రేపు రిలీజ్ అవుతున్న చిత్రలహరి సినిమా కోసం శరీరం పెంచిన సాయి..ఇప్పుడు బరువు తగ్గుతున్నారు. అంతేకాదు సిక్స్ ప్యాక్ చేసి కనపడాల్సిందే అని దర్శకుడు మారుతి ఖచ్చితంగా చెప్పారంటున్నారు. పాతిక కేజీలు ఒక్కసారిగా తగ్గటమే కాకుండా సిక్స్ ప్యాక్ అంటే కష్టమే గురు అంటున్నాడట సాయి. కానీ తప్పదు వేరే దారి లేదు అంటూ  మారుతి పెట్టిన కండీషన్ ఇది.

తన కథకు..నాజూకుగా, కండలు తిరిగి మాన్లీగా  ఉండే కుర్రాడు ఉండాలి అని మారుతి క్లియర్ గా చెప్పటంతో ఇప్పుడు ప్రత్యేకమైన జిమ్ కోచ్ ని ఏర్పాటు చేసుకుని కష్టపడుతున్నాడట. అయితే రెండు నెలలో ఈ సినిమా ప్రారంభం కానుంది. అంటే అప్పటిలోగా టార్గెట్  పూర్తి కావాలి. ఈ విషయమై మెగా హీరోలంతా తమ అనుభాలతో సలహాలు ఇస్తున్నారట. ముఖ్యగా చిరంజీవి తన మేనల్లుడుకు ఈ విషయమై చాలా సూచనలు చేసారట. వాటిని ఫాలో అయితే చాలు అన్నారట. 

యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం పూర్తి కామెడీతో సాగనుందిట. ఇప్పటికే మారుతి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనిలో పడ్డారట. మీడియం బడ్జెట్ లో తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాలని నిర్మాత అల్లు అరవింద్ క్లియర్ గా చెప్పటంతో అందుకు తగినట్లుగా మారుతి స్క్రిప్టులో మార్పులు, చేర్పులు చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత తన ఇమేజ్ మారుతుందని, ఫ్యామిలీలకు దగ్గర అవుతానని సాయి భావిస్తున్నారట. 

Follow Us:
Download App:
  • android
  • ios