గాన గాంధర్వుడు.. లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణంతో సినీ లోకం కన్నీటి పర్యంతమవుతుంది. సినీ తారలు ఆయన్ని తలుచుకుని భావోద్వేగానికి గురవుతున్నారు. విలక్షణ నటుడు, డైలాగ్‌ కింగ్‌ సాయి కుమార్‌ సైతం బాలుని తలచుకుని ఎమోషనల్‌ అయ్యారు. ఈ సందర్భంగా సాయికుమార్‌ ఓ వీడియోని పంచుకుని సంతాపం తెలిపారు. 

మరణం మనిషికే గానీ, మంచితనానికి కాదు. పరిమితి ప్రాణానికే గానీ ప్రతిభకు కాదు..కనుమరుగు కాయానికే గానీ, కీర్తికికాదు.. అవధులు ఆయుష్షుకేగానీ యశస్సుకి కాదు.. బాలు అన్నయ్య మీ మంచితనం, మీ ప్రతిభ, మీ కీర్తి, మీ యశస్సు వెండితెర.. బుల్లితెర సాక్షిగా.. మా గుండె తెరపై శాశ్వతం, స్ఫూర్తిదాయకం, ప్రాణాన్ని అనంత వాయువులకు..పాటని అశేష అభిమానులకు వదిలి వెళ్ళిన గాన గంధర్వులైన మీకు వందనం.. అభివందనం.. పాదాభివందనం.  బాలు అన్నయ్య మీరు.. మీ మాట.. మీ పాట చిరస్మరణీయం` అంటూ సాయి కుమార్‌ భావోద్వేగ వీడియో పంచుకున్నారు. ప్రస్తుతం ఇది విశేషంగా వైరల్‌ అవుతుంది.