Asianet News TeluguAsianet News Telugu

నిజమైన డంపింగ్ యార్డ్ లో కుబేర షూటింగ్.. ధనుష్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్

ధనుష్ డెడికేషన్ కి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ప్రస్తుతం ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేర చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

Dhanush kubera Movie shooting in mumbai dtr
Author
First Published May 6, 2024, 5:41 PM IST

ధనుష్ డెడికేషన్ కి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ప్రస్తుతం ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేర చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మందన ధనుష్ కి జోడిగా నటిస్తోంది. 

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలోని డంపింగ్ యార్డ్ లో జరుగుతోంది. ఎమోషన్స్ సహజంగా ఉండాలని శేఖర్ కమ్ముల నిజమైన డంపింగ్ యార్డ్ లో సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారట. ధనుష్ ఈ చిత్రంలో బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నారు. దీనితో డంపింగ్ యార్డ్ లో ధనుష్ 10 గంటల పాటు దుర్వాసన భరిస్తూ షూటింగ్ లో పాల్గొన్నారట.

ధనుష్ ఎలాంటి మాస్క్ ధరించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా డంపింగ్ యార్డ్ లో గడిపినట్లు తెలుస్తోంది. దీనితో ధనుష్ డెడికేషన్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధనుష్ పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తున్నాడట. 

ఇటీవల నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజయింది. ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. అసలు బిచ్చగాడికి, పోలీస్ అధికారికి లింక్ ఏంటి.. ఈ చిత్రంలో కుబేరుడు ఎవరు అనే ప్రశ్నలు ఈ చిత్రంపై ఉత్కంఠ పెంచేస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios