ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా నయా అప్డేట్ తో వచ్చారు. రేపు మూవీకి సంబంధిన బిగ్ సర్ప్రైజింగ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనితో రేపు ఆర్ ఆర్ ఆర్ నుండి రాజమౌళి ఇవ్వనున్న ఆ అప్డేట్ ఏమిటనే ఆసక్తి ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. అరుదుగా ఆర్ ఆర్ ఆర్ నుండి వస్తున్న అప్డేట్స్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఫ్యాన్స్ క్రియేవిటీకి సమాధానంగా ఓక్ అప్డేట్ ఇస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేయడం జరిగింది. 

నెలలు తరబడి సినిమా షూటింగ్ ఆగిపోగా ఆర్ ఆర్ ఆర్ సినిమా అభిమానులలో అసహనం పెరిగిపోతుంది. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ఎప్పుడు పూర్తి కానుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే అనుకున్న సమయానికి కంటే ఏడాదికి పైగా ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యం కానుంది. అనేక ప్రత్యామ్నాయాలు ప్రయత్నిస్తున్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని ఆలోచిస్తున్నప్పటికీ అది ముందుకు సాగడం లేదు. 

తాజాగా రాజమౌళి హైదరాబాద్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలుకానుంది అని, రెండు నెలల నిరవధిక షూటింగ్ ప్లాన్ చేసినట్లు చెప్పారు. దీనితో ఆర్ ఆర్ ఆర్ ని కనీసం 2021 చివర్లో నైనా థియేటర్స్ లో చూడవచ్చనే భావన కలిగింది. కాగా నేటి ప్రకటన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో గురించే అని ప్రచారం జరుగుతుంది. రెండు రోజుల క్రితమే కొమరం భీమ్ ఎన్టీఆర్ యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. 

రాజమౌళి సైతం ప్రస్తుత ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ సిద్ధం చేసినట్లు త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. ఐతే షూటింగ్ ఇంకా మొదలుకాని నేపథ్యంలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ పై అప్డేట్ వచ్చే అవకాశం కలదు. షూటింగ్ మొదలైన తరువాత ఫస్ట్ లుక్ వీడియో విడుదలపై అప్డేట్ రావచ్చనేది కొందరి అంచనా. ఏది ఏమైనా ఆర్ ఆర్ ఆర్ నుండి అప్డేట్ అంటే ప్రేక్షకులలో ఉండే ఆసక్తే వేరు అని చెప్పాలి.