Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళి కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ ఇలాంటి ట్విస్ట్ లు

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా తెర‌కెక్కుతోన్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. 

RRR: Rajamoli tension with Alia Bhatt dates problem
Author
Hyderabad, First Published Apr 10, 2019, 10:06 AM IST

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా తెర‌కెక్కుతోన్న చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. ఈ సినిమాలో హీరోయిన్స్  ఎంపిక‌ను రాజ‌మౌళి ఎన్నో  క‌స‌ర‌త్త‌లు చేసి ఫైనల్ చేసిన  సంగ‌తి తెలిసిందే. అయితే ఊహించని విధంగా అదో సమస్యగా మారింది. 

ఇప్పటికే హీరోయిన్ డైసీ.. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించడానికి ఒప్పుకొని తీరా సమయానికి హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే . అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా నుండి తప్పుకోవడానికి గల కారణాలను వెల్లడించింది డైసీ ఎడ్గర్ జోన్స్ . నా కుటుంబ సమస్యల వల్ల ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటించలేక పోతున్నానని అందుకే ఆర్ ఆర్ ఆర్ నుండి తప్పుకున్నానని  చెప్పింది. దాంతో వేరే హీరోయిన్ వేటలో పడ్డారు.

అయితే ఇప్పుడు ఈ టీమ్ కు మరో పెద్ద అడ్డంకి ఏమిటీ అంటే అలియా భట్ డేట్స్. రామ్ చరణ్ సరసన నటించటానికి ఓకే చేసిన ఆమె వరస పెట్టి పెద్ద ప్రాజెక్టులలో బిజీగా ఉంది. సడక్ 2, ఇన్షా అల్లా, హమ్ ఆపకే హై కౌన్ సీక్వెల్, బ్రహ్మాస్త్ర ఇలా వరసగా సినిమాలు ఉన్నాయి. దాంతో అలియా భట్ డేట్స్ చాలా జాగ్రత్తగా ఎడ్జెస్ట్ చేసుకుంటూ వెళ్తోంది. ఎక్కడ ఎవరి షెడ్యూల్ అప్ సెట్ అయ్యినా ఆమెతో పనిచేసే మిగతా సినిమావాళ్లకు ఇబ్బందిగా మారుతోంది. 

ఈ నేపధ్యంలో రాజమౌళి చేయాలని కమిటైన ఆర్ ఆర్ ఆర్ కు డేట్స్ కేటాయించే విషయంలో ఆమెకు  కంటిన్యూ డేట్స్ ఇవ్వలేని పరిస్దితి ఏర్పడిందిట. దాంతో ఆమె ఉన్నప్పుడే హీరోల డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటూ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.జూన్ లో కొద్ది రోజులు, జూలై లో కొద్ది రోజులు ఆమె డేట్స్ ఇస్తానందిట. మే నుంచి బ్రహ్మాస్త్ర బిజిలో పడిపోతుందిట.  దాంతో రాజమౌళి టీమ్...ప్రతీ క్షణం విలువైందిగా, రీటేక్స్ విషయంలో జాగ్రత్తలు వహించాల్సిన పరిస్దితి ఏర్పడిందిట.  

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న సినిమా కావ‌డంతో రాజమౌళి ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌టంలేదు. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానంతో ఉపయోగించుకుంటూ టాప్ టెక్నీషియ‌న్ల‌తో ముందుకు వెళ్లున్నాడు.  

 

 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ‘బాహుబలి’ తర్వాత జక్కన్న తీస్తున్న సినిమా కావడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios