ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)వసూళ్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే అనేక రికార్డ్స్ బద్దలు చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మ్యాజిక్ ఫిగర్ వైపుగా దూసుకుపోతుంది.  

ఆర్ ఆర్ ఆర్ (RRR Collections)బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. డొమెస్టిక్, ఓవర్సీస్ అనే తేడా లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే పలు ఏరియాల్లో బాహుబలి 2 రికార్డ్స్ బద్దలు కొట్టిన ఆర్ ఆర్ ఆర్ మ్యాజిక్ ఫిగర్ వైపుగా దూసుకుపోతుంది. ఇక మొదటి వారం ముగిసే నాటికి ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ గా రూ. 710 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఇండియా వరకు చూస్తే రూ. 560 కోట్ల గ్రాస్ దాటేసింది. మరో రెండు వారాలు బాక్సాఫీస్ వద్ద ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి పోటీ లేదు. 

కెజిఎఫ్ 2 ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ వెయ్యి కోట్ల మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక హిందీలో కూడా ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ. 132 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్స్ అందుకోవడం ఆర్ ఆర్ ఆర్ కి అసాధ్యమే. ఒక్క హిందీలోనే ఆర్ ఆర్ ఆర్ రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. 

Scroll to load tweet…

దర్శకుడు రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోగా తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ లో ఒకరు కొమరం భీమ్, మరొకరు అల్లూరి సీతారామరాజు పాత్రలు చేశారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు. డివివి దానయ్య నిర్మించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.