చేతిలో వంద పెట్టి బూతులు తిట్టాడు ఆ మ్యూజిక్ డైరెక్టర్: రోల్ రైడా!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 31, Aug 2018, 4:38 PM IST
roll rida about music director
Highlights

ర్యాపర్ గా అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన రోల్ రైడా బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు వారందరికీ దగ్గరయ్యాడు

ర్యాపర్ గా అతి తక్కువ మందికి మాత్రమే తెలిసిన రోల్ రైడా బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు వారందరికీ దగ్గరయ్యాడు. షోలో ర్యాప్ సాంగ్స్ పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లకముందు అతడు చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇండస్ట్రీకి చెందిన ఓ మ్యూజిక్ డైరెక్టర్ తనను దారుణంగా అవమానించాడని.. తన జీవితంలో అది ఘోరమైన అవమానమని చెప్పుకొచ్చాడు.

''నా జీవితంలో బాధ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఓ మ్యూజిక్ డైరెక్టర్ ఘోరంగా అవమానించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేను. గతంలో ఓ మ్యూజిక్ డైరెక్టర్ నన్ను పాట పాడడానికి పిలిపించారు. అక్కడకి వెళ్లిన తరువాత.. 'ఏంట్రా నువ్వు నీ అవతారం.. నీకు ఇరవై రూపాయలు ఇస్తా పోయి లంచ్ చేసి పాట పాడేసి పో.. నీకు అవకాశం ఇవ్వాలంటే నేను తప్ప గత్యంతరం లేదు.

నేను తప్ప దిక్కులేదు అది గుర్తుపెట్టుకో.. అని పాట పాడించుకొని చేతిలో వంద రూపాయలు పెట్టి బూతులు తిట్టి పొమ్మన్నారు. ఆరోజు మ్యూజిక్ డైరెక్టర్ తిన్న ఎంగిలి ప్లేట్ లో ఉన్న చికెన్ ముక్కల్ని నాకు ఇచ్చి తినేసెయ్ రా అన్నారు. ఆ సీన్ చూసాక ఇండస్ట్రీలో ఇలా ఉంటారా అనిపించింది. వీళ్లతో మాటలు పడడానికేనా నేను ర్యాపర్ గా మారిందని బాధ పడ్డాను. దాని నుండి కోలుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది.

ఆ తరువాత అతడి నుండి ఫోన్ కాల్స్ వచ్చిన పాట పాడడానికి మాత్రం వెళ్లలేదు. ఏదైనా ఉద్యోగం చేసుకోవాలనుకున్నా.. కానీ నా స్నేహితులు నాలో ధైర్యం నింపారు. నన్ను ఎంతో ప్రోత్సహించారు'' అంటూ చెప్పుకొచ్చాడు.   

loader