సెన్సార్‌తో సంబంధం లేకుండా తన సినిమాలను వరుసగా RGVWorld.in/ShreyasET ఆన్ లైన్‌లో విడుదల చేస్తున్నాడు వర్మ. ఈ నేపధ్యంలో  మితిమీరి అంగాంగ ప్రదర్శన చేయిస్తూ రెచ్చిపోతున్నాన్నాడు వర్మ.  తాజాగా ఆయన  డోస్ పెంచి 'నగ్నం' (NAKED) అంటూ మరో అడల్ట్ మూవీని రెడీ చేశారు.  ఈ చిత్రాన్ని జూన్ 27 రాత్రి 9 గంటలకు RGVWorld.in/ShreyasET ద్వారా సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నాడు వర్మ. ఈ సినిమా ఒక్కసారి చూడాలంటే రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సారి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వెర్షన్లలో ఈ చిత్రం రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన కట్ చేసిన ట్రైలర్స్ షాక్ ఇస్తున్నాయి. రీసంట్ గా ఈ నగ్న సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేసి ప్రేక్షకుల చేత ''వామ్మో!'' అనిపించుకున్నారు.

ఈ సినిమాని నేకెడ్, నంగీ, నగ్నం పేర్లతో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తీసాడు.  ఆ మధ్య పొలిటికల్ సెటైర్లు తీసి బొక్క బోర్లా పడ్డ రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు రాజకీయం బాట వదిలి పెట్టి రొమాన్సు, వైయలెన్సు వైపు చూస్తున్నాడు. ఈయన్ని చూసి మరింత మంది ప్రేరణ పొందబోతున్నారు. కరోనాతో ప్రపంచం అల్ల కల్లోలం అవుతున్న టైమ్ లో కరోనా వైరస్ పేరుతో హారర్ చిత్రం తీసి రిలీజ్ కు రెడీ చేసారు రామ్ గోపాల్ వర్మ.