Asianet News TeluguAsianet News Telugu

సెక్స్, డేటింగ్ గురించి యాంకర్ రష్మీ షాకింగ్ పోస్ట్.. రాక్షసత్వమైన శృంగార కోరికలతో అది కోల్పోతున్నాం 

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. తాజాగా రష్మీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన పోస్ట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

 

Rashmi Gautam shocking post on dating goes viral dtr
Author
First Published Jul 29, 2023, 5:04 PM IST

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది. బుల్లితెరపై గ్లామర్ గా, కామెడీ పంచ్ లు వేస్తూ కనిపించే రష్మీ వేరు.. ఆఫ్ స్క్రీన్ లో రష్మీ వేరు.  ఆమెలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది.  

జంతు హింస గురించి చిన్న సంఘటన జరిగినా రష్మీ వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తుంది. అలాగే రష్మీ సామాజిక అంశాల గురించి మాట్లాడేందుకు కూడా వెనుకాడదు. ధైర్యంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. తాజాగా రష్మీ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన పోస్ట్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

సెక్స్, డేటింగ్ గురించి రష్మీ పెట్టిన పోస్ట్ బోల్డ్ గా ఉంది. డేటింగ్ సాంప్రదాయం వల్ల మానవ సంబంధాలు ఎలా దెబ్బ తింటున్నాయో వివరించే ఓ దృశ్యాన్ని రష్మీ పోస్ట్ చేసింది. శృంగార పరమైన దృశ్యాలు ఒక సైకిల్ లా ఉన్న ఆ ఫోటో లో.. 'డేటింగ్ సంప్రదాయం వల్ల ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. సంబంధాలు, వావి వరసల గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ శృంగారాన్ని అనుభవించడంలో బిజీగా ఉన్నారు. 

Rashmi Gautam shocking post on dating goes viral dtr

దేవుడు నిజమైన ప్రేమని పొందండి అని మన మార్గంలో పంపుతుంటే.. రాక్షసత్వమైన శృంగార కోరికలతో ప్రేమని తిరస్కరిస్తున్నారు. విషపూరితమైన సంబంధాలు ఒక సైకిల్ లా మన చుట్టూ నెలకొన్నాయి' అని అందులో రాసి ఉంది. రష్మీ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

రష్మీ చేసిన ఈ పోస్ట్ తో చాలా మంది నెటిజన్లు ఏకీభవిస్తునారు. ఇదిలా ఉండగా రష్మీ మతపరమైన అంశాల గురించి కూడా తరచుగా మాట్లాడుతూ ఉంటుంది. కొన్నిసార్లు ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios