నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
నటుడు రాజేంద్రప్రసాద్ ఇంత తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి కన్నుమూశారు.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి మరణించినట్లు సమాచారం అందుతుంది. అక్టోబర్ 4వ తేదీన ఆమె గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నేడు గాయత్రి తుదిశ్వాస విడిచారు. గాయత్రి భర్త మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గాయత్రి వృత్తిరీత్యా న్యూట్రిషియన్.
గాయత్రికి ఒక కుమార్తె కాగా.. మహానటి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. కూతురు మరణవార్తతో రాజేంద్రప్రసాద్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కన్నీరు మున్నీరు అవుతున్నారు. గతంలో ఓ వేడుకలో తనకు ఇష్టం లేకుండా కూతురు ప్రేమ వివాహం చేసుకుందని రాజేంద్ర ప్రసాద్ చెప్పడం విశేషం. గాయత్రి ప్రస్తుత వయసు 38 ఏళ్ళు. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారట.
బిగ్ బాస్ తెలుగు 8 లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి