సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితంలో బూతులు, చీకటి కోణం తప్ప మరేదీ ఉండదని అంటున్నాడు. వర్మ ఏ విషయం గురించైనా.. చాలా ఓపెన్ గా మాట్లాడతాడు. కౌంటర్లు, సెటైర్లు వేయడంలో ఆయన్ని మించినవారు ఉండరు.

అయితే ఇప్పుడు ఆయనపై ఆయనే సెటైర్ వేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. సినీ తారలు, రాజకీయనాయకులు, క్రీడాకారుల జీవితాలపై బయోపిక్ లను రూపొందిస్తున్నారు.

వర్మ కూడా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీశాడు. అది రిలీజ్ కి సిద్ధంగా ఉంది. త్వరలోనే వైఎస్సార్, కేసీఆర్ జీవితాలపై సినిమాలు తీస్తానని చెప్పాడు. అయితే ఎవరైనా తన జీవితంపై బయోపిక్ తీస్తే అనే విషయంపై మాట్లాడాడు. 

తన జీవితాన్ని ఎవరైనా సినిమాగా తీయాలని ప్రయత్నిస్తే అది సెన్సార్ దగ్గరే ఆగిపోతుందని చెప్పాడు. తన జీవితంలో బూతులు, చీకటి కోణం తప్ప మరేదీ ఉండదని, కాబట్టి అలాంటి ప్రయత్నాన్ని ఎవరూ చేయొద్దని చెప్పాడు.