అందుకోసం ఈ హీరోలిద్దరిని ఒకే స్టేజ్‌పైకి తీసుకొస్తున్నారు . అయితే ఇంకా పూర్తి గా ఖరారు కాలేదు. త్వ‌ర‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన డేట్, వెన్యూ పై అఫీషియల్ ప్ర‌క‌ట‌న రానుంది.


 RRR హీరోలిద్దరూ ఒకే స్టేజిని షేర్ చేసుకోబోతన్నారు.  అయితే అది ఆస్కార్ వచ్చినందుకు ఈ హీరోలిద్దరనీ సన్మానించే పంక్షన్ కాదు. అలాగని వీరిద్దరు కలిసి ఆస్కార్ తెచ్చిన రాజమౌళి కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్ కాదు..మరి దేనికి అంటే...అయ్యగారి కోసం...

 టాలీవుడ్‌లో అయ్యగారిగా పిలవబడి అఖిల్ అక్కినేని కోసం ఈ హీరోలిద్దరూవస్తున్నారు. అఖిల్ హీరోగా న‌టించిన చిత్రం ఏజెంట్‌. పాన్ ఇండియా మూవీగా ఇది ఏప్రిల్ 28న రిలీజ్‌కు సిద్ధమైంది. భారీ అంచనాల‌తో రూపొందిన ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్‌కు మేక‌ర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏజెంట్ ప్రీ రిలీజ్‌ను భారీ  గా ప్లాన్ చేసారు.  అందుకోసం ఈ హీరోలిద్దరిని ఒకే స్టేజ్‌పైకి తీసుకొస్తున్నారు అఖిల్ అక్కినేని. అయితే ఇంకా పూర్తి గా ఖరారు కాలేదు. త్వ‌ర‌లోనే ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన డేట్, వెన్యూ పై అఫీషియల్ ప్ర‌క‌ట‌న రానుంది.

  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తర్వాత అఖిల్ హీరోగా నటిస్తోన్న చిత్రమిది. ఏజెంట్ సినిమాలో 8 ప్యాక్లో అఖిల్ కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఫిజికల్గా చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఈ సాక్షి వైద్య హీరోయన్గా నటిస్తోంది. చిరంజీవి సైరా నరసింహారెడ్డి తర్వాత సురేంద్రరెడ్డి డైరక్షన్ చేస్తున్న చిత్రం ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

 ఏజెంట్ మూవీ గత మూడేళ్లుగా షూటింగ్ను జరుపుకుంటోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ లో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. నిర్మాత అనిల్ సుంకరతో కలిసి దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోనే సురేందర్రెడ్డి నిర్మాతగా మారబోతున్నాడు.

అఖిల్ ఏజెంట్ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, సురేంద‌ర్ 2 సినిమా బ్యాన‌ర్స్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా అనీల్ సుంక‌ర సినిమాను నిర్మించారు. ఈ స్పై థ్రిల్ల‌ర్‌ను తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.