సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రేక్షకుల్లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే బాక్సాఫీస్ వద్ద రికార్లు ఖాయం.

ఫ్లాప్ టాక్ వచ్చినా సరే వసూళ్ల వర్షం మాత్రం ఆగదు. తాజాగా ఆయన నటించిన '2.0' సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమాతో మరికొన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నాడు రజినీకాంత్. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన సాధించిన ఓ అరుదైన రికార్డ్ గురించి సోషల్ మీడియాలో అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.

రజినీకాంత్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలతో తన కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తరువాత కలర్ సినిమాలలో నటించారు. అలానే 'కొచ్చయడాన్' చిత్రంతో యానిమేటెడ్ సినిమాలో కూడా నటించాడు.

ఇప్పుడు ఆయన '2.0' సినిమా తొలిసారి త్రీడీ సినిమాలో కూడా నటించాడు. ఇలా బ్లాక్ అండ్ వైట్, కలర్, యానిమేటెడ్, త్రీడీ మొత్తం నాలుగు రకాల సినిమాల్లో నటించిన హీరో ఇండియాలో మరెవరూ లేరు. ఈ విషయాన్ని గుర్తించిన అభిమానులు సోషల్ మీడియాలో దీని గురించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు. 

ఇవి కూడా చదవండి.. 

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?