భారీ అంచనాలతో తెరకెక్కుతున్న RRR సినిమా విడుదల కావడానికి సమయం చాలానే ఉన్నప్పటికీ సినిమాకు సంబందించిన రూమర్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు రాజమౌళి స్వాతంత్ర సమరయోధుల పాత్రలను తీసుకొని సరికొత్త విజువల్ వండర్ నీవు క్రియేట్ చేయబోతున్నాడు.

నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ కోమురం భీమ్ గా కనిపించబోతుండగా  - మెగా హీరో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామ రాజుగా దర్శనమివ్వనున్నాడు. ఇక సినిమాలో ఎమోషన్ కంటెంట్ అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ సాలిడ్ గా ఉన్నాయి. అలాగే సాంగ్స్ కూడా సరికొత్తగా ఉండేలా దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఒక సాంగ్ డిజైన్ కి ప్రణాళికలు రచిస్తున్నారు.  హీరోలిద్దరు కూడా డ్యాన్స్ లో ఎవరికీ వారు బెస్ట్ టాలెంట్ ని కలిగి ఉన్నారు.

ఒకే ఫ్రేమ్ లో ఇద్దర్ని ఎలా చూపిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.అంటే కమర్షియల్ గా కాకుండా జాతర లాంటి బ్యాక్ డ్రాప్ లో ఉత్సవాలకు సంబందించిన వాతావరణంలో సాంగ్ ని చిత్రీకరించనున్నారట, ఇక కీరవాణి ఇప్పటికే కొన్ని ట్యూన్స్ ని రెడీ చేసి ఉంచినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా బ్యాక్ గ్రౌండ్ ని కూడా మొదలుపెట్టారట. కీరవాణి ఈ సినిమాలో సరికొత్త సౌండ్స్ ని ఎలివేట్ చేయనున్నారట. మరి మ్యూజిక్ పరంగా కీరవాణి ఈ సారి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి. డివివి.దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.