Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళిని అభినందించిన జేమ్స్ కామెరూన్, నమ్మనేకపోతున్నానంటూ జక్కన్న ఎమోషనల్ ట్వీట్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి.. ఫుల్.. దిల్ ఖుషీ అవుతున్నారు. తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటూ పోస్ట్ పెట్టారు. ఎంతో మంది దర్శకులకు ఆరాధ్యుడైన హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ను కలుసుకున్నారు జక్కన్న. తన సంతోషాన్ని సోషల్ మీడియలో పంచుకున్నారు. 

Rajamouli Meets Avatar Director James Cameroon In Hollywood
Author
First Published Jan 16, 2023, 10:25 AM IST

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు.. టైటానిక్, అవతార్ లాంటి అద్భుతాల సృష్టి కర్త  జేమ్స్ కామెరూన్ ను కలుసుకున్నారు ఇండియన్ స్టార్ డైరెక్టర్.. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి. అంతే కాదు దాదాపు 10 నిమిషాల పాటు వారి మధ్య సినిమాల గురించి డిస్కర్షన్ జరిగింది. అంతే కాదు..తాను ట్రిపుల్ ఆర్ సినిమా చూశానని.. ఆ సినిమాన చాలా బాగుందని. ఎంతో ఇష్టపడ్డాను అంటూ జేమ్స్ కామెరూన్ రాజమౌళితో అన్నారు. పక్కనే ఉన్న తన భార్యను కూడా ఈ సినిమా చూడాలంటూ సిఫార్స్ చేశారు. తనతో పాటు మళ్ళీ ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి చూశానన్నారు జేమ్స్. దాంతో రాజమౌళి ఆనందానికి అవధులులేకుండా పోయాయి. వెంటనే జక్కన్న సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. 


సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించిన రాజమౌళి..కామెరూన్ తో మాట్లాడుతున్న ఫోటోను శేర్ చేశారు. ఆయన ఈవిధంగా రాసుకొచ్చారు.  గ్రేట్ జేమ్స్ కామెరాన్ RRRని చూశాడు.. అతను దానిని ఎంతగానో ఇష్టపడ్డాడు, అతను తన భార్య సుజీకి కూడా సినిమా చూడాలిన  సిఫార్సు చేసాడు. అంతే కాదు  ఆమెతో కలిసి మళ్లీ తాను కూడా సినిమా మరోసారి చూస్తా అన్నారు. సార్ మీరు మా సినిమాని విశ్లేషించడానికి నాతో  మొత్తం 10 నిమిషాలు గడిపారు. ఈ విషయాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీరు చెప్పినట్లు I AM ON TOP OF THE WORLD...ఈ క్షణాలు జీవితంలో మర్చిపోలేదు.. మీఇద్దరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు జక్కన్న. 

 

రాజమౌళి పోస్ట్ కు సోషల్ మీడియాలో భారీగా రెస్పాన్స్  వస్తోంది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇండియన్ జేమ్స్ కామెరూన్ రాజమౌళి అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. అద్భుతమంటున్నారు. ట్రిపుల్ ఆర్ ఎలాగైనా ఆస్కార్ సాధిస్తుందంటూ.. ఆశతో ఉన్నారు. ముఖ్యంగా టాలీవుడ్ రాజమౌళిని చూసి గర్వంగా తలెత్తుకుంటుందంటున్నారు నెటిజన్లు. అంతకు ముందే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పిల్ బర్గ్ ను కూడా కలిశారు జక్కన్న. ఆయన కూడా ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. 

కాగా ఎన్టీఆర్,  రామ్ చరణ్  హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  RRR సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. భారీ కలెక్షన్లతో పాటు.. హాలీవుడ్ మేకర్స్ ను కూడా ఆకర్షించిన ఈ సినిమా.. తన విజయ ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. హాలీవుడ్ లో మరింత పాపులారిటీ సాధిస్తోంది మూవీ.. వరుస గౌరవాలు సాధిస్తుండటంతో.. వాటిని అందుకోవడం కోసం రాజమౌళి కొంత కాలంగా ఫారెన్ టూర్లలోనే ఉంటూ వస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇంకా  ఎక్కువగా ప్రమోషన్ చేస్తూ.. సందడి చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఇటీవలే ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డుని బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ గెలుచుకుంది. ఈ అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ కు  దేశమంతా అభినందనలు చెప్పింది. ప్రధాని నరేంద్ర మోదీ దగ్గర నుంచి..ముఖ్యమంత్రులు ఇతర ప్రముఖులు కూడా టీమ్ ను మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. చెప్తున్నారు. ఇక ఇప్పటికే RRR సినిమా, నాటు నాటు సాంగ్ ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్ట్ లో నిలిచాయి. ఎలాగైనా ఆస్కార్ కొట్టాలని రాజమౌళి అమెరికాలోనే ఉండి RRR ని మరింత ప్రమోట్ చేస్తూ తెగ కష్టపడుతున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios