Asianet News TeluguAsianet News Telugu

బ్రో మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ సూపర్ ఫాస్ట్ గా తన షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్రో మూవీలో తన పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేశాడు. 

Power Star Pawan Kalyan Complete Shooting part Of Bro Movie JMS
Author
First Published Jun 7, 2023, 8:44 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ బ్రో. తమిళం లో సూపర్ హిట్ అయిన వినోదయ సీతంకు తెలుగు రీమేక్ గా ఈసినిమా రూపొందుతోంది. తమిళంలో ఈమూవీని డైరెక్ట్ చేసిన నటుడు, దర్శకుడు సముద్రఖని తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈసినిమాను  జూలై 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 

ఇక ఇప్పటికే ఈసినిమా సైలెంట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటూ.. వచ్చిన ఈసినిమా సడెన్ గా ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. టైటిల్ పోస్టర్ అనౌన్స్ చేయడం.. హీరోల స్పెషల్ లుక్స్ మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహాన్నినింపుతున్నాయి. బ్రో సినిమాపై తాజాగా అంచనాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈక్రమంలోనే ఈమూవీలో తన పార్ట్ షూటింగ్  ను కంప్లీట్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 

నిజానికి పవర్ స్టార్ టాకీ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. అయితే ఈమూవీకోసం కొత్తగా ఓ స్పెషల్ సాంగ్ పెట్టాలని నిర్ణయించడంతో ఈ సాంగ్  కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల ను తీసుకున్నారు మేకర్స్.. దాంతో ఈ సాంగ్ షూట్ కోసం పవర్ స్టార్ మళ్ళీ సెట్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఇక మిగతా కార్యక్రమాలు కూడా సూపర ఫాస్ట్ గా కంప్లీట్ అవుతున్నాయి. సినిమా షూటింగ్ నడుస్తుండగానే.. రఫ్ గా పోస్ట్ ప్రొడక్షన్ ను కంప్లీట్ చేస్తూ వస్తున్నారు టీమ్.రిలీజ్ డేట్ దగ్గర పడటంతో.. ప్రమోషన్స్ కు కూడా పదును పెట్టారు టీమ్. 

ఇక ఈసినిమా తెలుగు కథలో తన మార్క్ పంచ్ లతో మార్పులు చేర్పులు చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందరికీ తెలిసిందే.  ఇక బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో.. ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవర్ కళ్యాణ్. దాదాపు నాలుగైదు సినిమాలు సెట్స్ ఎక్కించి.. వారికి కొంత.. వారికి కొంత టైమ్ కేటాయిస్తూ.. తెగ బిజీ అయిపోయాడు. వారానికో సెట్‌లో దర్శనమిస్తూ చక చక షూటింగ్‌లను కంప్లీట్ చేస్తున్నాడు. త్వరగా సినిమాలు కంప్లీట్ చేసి.. పొలిటికల్ గా బిజీ అయిపోవాలని చూస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios