Asianet News TeluguAsianet News Telugu

Laal Singh Chaddha: షాక్ ఇస్తున్న అడ్వాన్స్ బుక్కింగ్స్

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్‌  ఆమిర్ ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత ఆమిర్ న‌టించిన సినిమా. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఆదివారం ఐపీఎల్ ఫైన‌ల్ జ‌రుగుతున్న‌ప్పుడు రిలీజ్ చేశారు. ఆమిర్ ఖాన్‌, కిర‌ణ్ రావ్‌, జ్యోతి దేశ్ పాండే, వ‌యాకామ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 11న సినిమా రిలీజ్‌కి సిద్ద‌మ‌వుతోంది. కోవిడ్ ప‌రిస్థితులు షూటింగ్‌పై ప్ర‌భావం చూప‌టంతో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌టానికి ఆల‌స్య‌మైంది.

Poor Advances For Aamir Khan  Laal Singh Chaddha, Film
Author
Mumbai, First Published Aug 7, 2022, 3:35 PM IST


బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ (Amir Khan) నటించిన లేటెస్ట్ మూవీ లాల్ సింగ్ చడ్డా (Lal Singh Chadda). టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్స్ కోసం ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోస్‌ని ప్రదర్శించారు. అద్వైత్ చందన్ (Adhvaith Chandan) దర్శకత్వం వహించిన ఈ మూవీని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయా కామ్ 18 స్టూడియోస్ సంస్థలు భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. నాగచైతన్య ఇందులో బోడి బాలరాజు అనే పాత్రను పోషించారు. ఈ చిత్రం రిలీజ్ కు మరో వారం మాత్రమే సమయం ఉంది. అడ్వాన్స్ బుక్కింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే షాకింగ్ గా అడ్వాన్స్ బుక్కింగ్స్ చాలా పూర్ గా ఉన్నాయి. 

బాలీవుడ్ స్టార్ ఆమీర్‌ఖాన్ నుండి సినిమా వ‌చ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. అభిమానులు ఈయ‌న సినిమా కోసం ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారని భావిస్తే ఈ పరిస్దితి ఆశ్చర్య పరుస్తోంది. సాదారణంగా అమీర్ ఖాన్ సినిమాలకు మంచి ఓపినింగ్స్ ఉంటాయి. అమీర్ గత చిత్రాలు దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ రెంటికి రికార్డ్ బ్రేకింగ్ ఓపినింగ్స్ వచ్చాయి. ఇండియాలో హైయిస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ లుగా అవి రికార్డ్ లు క్రియేట్ చేసాయి. ఇప్పుడా పరిస్దితి కనపడటకపోవటం బాలీవుడ్ ని కలవరపరుస్తోంది. అప్పటికీ ఈ సినిమాని సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కు కూడా అదే పరిస్దితి కనపడుతోంది. అయితే స్లోగా ప్రారంభమయ్యినా ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ వస్తే నిలబడుతుందని అంటున్నారు.

ప్ర‌స్తుతం ఈయన ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘లాల్ సింగ్ చ‌డ్డా’ విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అద్వౌత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 11న విడ‌ద‌ల కానుంది. తెలుగులో ఈ చిత్రానికి చిరంజీవి స‌మ‌ర్ప‌కుడిగా ఉండ‌టం విశేషం. ప్ర‌స్తుతం చిత్ర బృందం ప్ర‌మోష‌న్‌ల‌లో బిజీగా ఉంది. ఫ్రెండ్‌షిప్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ తాజాగా ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

‘మ‌న‌మిద్ద‌రం ఎప్పుడూ క‌లిసే ఉంటాం. నేను బ‌నియ‌న్, నువ్వు చ‌డ్డీలా’ అనే కాప్ష‌న్‌తో నాగ‌చైత‌న్య‌, అమీర్‌ఖాన్‌లు క‌లిసి ఉన్న పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో వీరిద్ద‌రూ ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా తాడుపై వేలాడుతూ ఒక‌రినొక‌రు చూసుకుంటున్నారు. లేట‌స్ట్‌గా విడుద‌లైన ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రం హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’ సినిమాను బేస్ చేసుకుని తెర‌కెక్కించారు. 

అమీర్‌కు జోడీగా క‌రినా క‌పూర్ హీరోయిన్‌గా న‌టించింది. వయాక‌మ్18 స్టూడీయోస్‌తో క‌లిసి అమీర్‌ఖాన్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. గ‌తంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల్ల విడుద‌ల తేదీ వాయిదా పడుతూ వ‌చ్చింది. కాగా ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల కానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios