Asianet News TeluguAsianet News Telugu

Pokiri: కొత్త సినిమాలా సరికొత్త రికార్డ్ లు, మైండ్ బ్లాంక్


పోకిరి సినిమాలో ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు అంటాడు.. నిజంగానే పండుగాడి రీ రిలీజ్ కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. 

Pokiri Re-Release Creates A History
Author
Hyderabad, First Published Aug 7, 2022, 3:14 PM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ‘పోకిరి’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ మరియు మహేష్ సోదరి మంజుల కలిసి నిర్మించారు. 2006 ఏప్రిల్ 28 న ఈ చిత్రం విడుదలయ్యింది. ఎటువంటి  ఎక్సపెక్టేషన్స్  లేకుండా విడుదలైన ఈ చిత్రానికి మొదట డివైడ్ టాక్ వచ్చింది. కానీ రెండో వారం నుండీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చిత్రం బాక్సాఫీస్ మీద దండయాత్ర చెయ్యడం మొదలుపెట్టింది. పోటీగా విడుదలైన పవన్ కళ్యాణ్ ‘బంగారం’ సినిమా కూడా దీని ముందు నిలబడలేకపోయింది. 299 కేంద్రాల్లో 50 రోజులు, 200 కేంద్రాల్లో 100 రోజులు, 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ చిత్రం రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ చిత్రం రికార్డ్ లు క్రియేట్ చేయటం చెప్పుకోదగ్గ విషయం.

 ఆగ‌స్ట్ 9న మ‌హేష్‌బాబు పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. తొలుత కొన్ని థియేట‌ర్ల‌లో మాత్ర‌మే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అభిమానుల రెస్పాన్స్ అంత‌కంత‌కు పెర‌గ‌డంతో స్క్రీన్స్ సంఖ్య పెంచుతూ వ‌చ్చారు. ఇండియాతో పాటు ఓవ‌ర్‌సీస్‌లో క‌లిసి 135 స్క్రీన్స్‌లో పోకిరిని 4 కే వెర్ష‌న్‌లో రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. 

అత్య‌ధిక సెంట‌ర్స్ లో రెండోసారి రిలీజ్ అవుతున్న సినిమాగా పోకిరి కొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అలాగే  ఈ రీ రిలీజ్‌కు మూడు రోజుల ముందే అన్ని షోల టికెట్స్ అమ్ముడుపోయాయి. హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన థియేట‌ర్స్ అన్నింటిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఏపీలో ప‌లు న‌గ‌రాల్లో అడ్వాన్ప్ బుకింగ్స్ ప్రారంభించిన కొద్ద గంట‌ల్లోనే థియేట‌ర్స్ హౌజ్‌పుల్ అవటం అందరికీ షాక్ ఇస్తోంది.

అమెరికాలో దాదాపు ప‌దిహేడు ప్రాంతాల్లో 24 థియేట‌ర్ల‌లో పోకిరి స్క్రీనింగ్ కాబోతున్న‌ది. రిలీజ్ అయ్యి ప‌ద‌హారేళ్లు అయినా సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేద‌న‌డానికి అడ్వాన్స్ బుకింగ్స్ నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి. ఈ సినిమా ద్వారా వ‌చ్చిన వ‌సూళ్ల‌ను మ‌హేష్ బాబు ఫౌండేష‌న్ ద్వారా సేవా కార్య‌క్ర‌మాల‌కు వినియోగించ‌బోతున్నారు. పోకిరి సినిమా ఒక ఫక్త్ మాస్ కమర్షియల్ మూవీ. అదిరిపోయే మాస్ ఎలిమెంట్స్ తో పూరి సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే ....అనే తెలుగు సినిమా ఐటెం సాంగ్ అంటే ఇప్పటికి కూడా పోకిరి సాంగ్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు. అలాగే క్లైమాక్స్ మరియు ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు ఇప్పటికి కూడా సర్ ప్రైజింగ్ గా అనిపిస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios