Asianet News TeluguAsianet News Telugu

రేణుదేశాయ్ పై నెటిజన్ బూతులు!

నటి రేణుదేశాయ్ ని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అసభ్యపదజాలంతో దూషించాడు. దీనికి ఆమె ఘాటుగా బదులు కూడా ఇచ్చింది. 

netizens comments on renudesai
Author
Hyderabad, First Published Mar 13, 2019, 10:23 AM IST

నటి రేణుదేశాయ్ ని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ అసభ్యపదజాలంతో దూషించాడు. దీనికి ఆమె ఘాటుగా బదులు కూడా ఇచ్చింది. అసలేం జరిగిందంటే.. ముందుగా ఓ నెటిజన్.. ''నేను ఒక రైతు కొడుకుని. ఇరవై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. మీరందరూ(నటీనటులు) రైతుల కోసం ఏం చేస్తున్నారు. ఏమీ లేదు. కొన్ని డబ్బుల కోసం మేకప్ వేసుకొని కెమెరా ముందు డ్రామా చేస్తున్నారు'' అంటూ 'ఎఫ్' వర్డ్స్ వాడుతూ ఆమెని దూషించాడు.

దీన్ని స్క్రీన్ షాట్ తీసిన రేణుదేశాయ్ సదరు నెటిజన్ కి ఘాటు సమాధానమిచ్చింది. ఒక సెలబ్రిటీ ఎప్పుడైనా 'ఎఫ్'(అసభ్యపదజాలం) అనే పదాన్ని సోషల్ మీడియాలో ఒక అభిమాని మీద వాడితే అది బ్రేకింగ్ న్యూస్ అవుతుందని, దయ లేకుండా ఆ సెలబ్రిటీని ట్రోల్ చేస్తారని.. కానీ అదే పదం ఒక మామూలు మనిషి ఒక సెలబ్రిటీ మీద వాడితే మాత్రం వాళ్లు స్పందించకూడదని అసహనం వ్యక్తం చేసింది.

సెలబ్రిటీలను ఎవరు పడితే వాళ్లు ఏది పడితే అది అనొచ్చు అంటూ మండిపడింది. సెలబ్రిటీలు మాత్రం అవన్నీ భరిస్తూ ఎలాంటి ఎమోషన్స్ చూపించకూడదని.. మాకు భావోద్వేగాలు ఉండవా..? అంటూ ప్రశ్నించింది. రైతులకు ఏదోక విధంగా సహాయపడాలని చేస్తోన్న ప్రయత్నాన్ని విమర్శిస్తూ, దూషించడం దారుణమని తెలిపింది.

ఏదొక రోజు పేరు బయటపెట్టకుండా.. ట్రోల్స్  చేసేవారంతా తప్పు తెలుసుకొని, వారి శక్తి సామర్ధ్యాలను ఇలా అనవసరంగా సెలబ్రిటీలను దూషించడం కోసం కాకుండా ఏదైనా మంచి పని కోసం వాడితే మంచిది అంటూ సూచించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

. Ee post khacchithanga chaduvuthaarani anukuntunnaanu. Oka celebrity eppudanna “F” ane padaanni social media lo oka abhimaani meeda vaadithe em jaruguthundo mee andariki thelsu. Adi oka breaking news authundi. Nirdayaga Chala daarunanga aa celebrity ni troll chesthoo dooshisthaaru. Kaani ade padam oka maamoolu manishi oka celebrity meeda vaadithey vaallu matram etti paristhithullo spandinchakoodadu ! Enti idi ? Ante oka celebrity ni evaru padithe vaallu yedi padithe adi anocchu dooshinchocchu. Avanni aa celebrity bharinchaali sahinchaali. Elaanti bhaavodvegaaniki guri kaakoodadu. Ante maamool manushulaku matrame bhaavaalu bhaavodvegaalu untai.... celebrity laku undakoodadu ! Prathi roju mee social media lo evaro okaru yedo rakanga mimmalni dooshisthoo yevevo post lo peduthoo unte vaatini chaduvthunnappudalla meeku ela untundo Okka sari oohinchukondi.... Adi kooda raithulaku yedo rakanga saayapadaalani nenu chesthunna prayatnaanni vimarsisthoo nannu dooshinchadam maree daarunam. Nenu Dabbu kosam chesthunnaana leka Peru kosam chesthunnaana Leda Inkedanna kaaranam kosam chesthunnaana annadi mukhyam kaadu. Daani valla mana raithula samasyalu entha varaku baitiki theesukocchi prajala mundu peduthunnam annadi mukhyam ! Yedo oka roju ee ooru peru leni ee troll chese vaallantha vaari thappu thelsukuni vaari shakthi saamardhyaalani ila anavasaranga celebrity lanu dooshinchadam kosam pettakunda yedanna manchi pani kosam pedithe manchidi😊

A post shared by renu (@renuudesai) on Mar 11, 2019 at 10:40pm PDT

Follow Us:
Download App:
  • android
  • ios