అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా నవీన్ చంద్ర హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. అప్పుడపుడు ఏవో అవకాశాలు వస్తున్నప్పటికీ గుర్తింపు రాలేదు. కానీ నేను లోకల్ సినిమాతో డిఫరెంట్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నాడు.
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా నవీన్ చంద్ర హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. అప్పుడపుడు ఏవో అవకాశాలు వస్తున్నప్పటికీ గుర్తింపు రాలేదు. కానీ నేను లోకల్ సినిమాతో డిఫరెంట్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నాడు. ఇక ఫైనల్ గా అరవింద సమేతలో అతను చేసిన బాలిరెడ్డి పాత్ర బాగా క్లిక్ అవుతోంది.
ఎన్టీఆర్ - జగపతి బాబు తరువాత అతని పాత్రకే ఎక్కువ గుర్తింపు దక్కింది. అయితే మొదట ఈ పాత్ర గురించి దర్శకుడు త్రివిక్రమ్ వివరించగానే నవీన్ ఒక నిర్ణయానికి వచ్చాడట. పాత్ర రియలిస్టిక్ గా ఉండాలని గట్టిగా బీర్లు లాగించేశాడట. మరీ మొహం పీక్కుపోయినట్టు కాకుండా గుండ్రంగా ఉండటానికి బీర్లు వేస్తె సెట్ అవుతుందని నవీన్ చెప్పడంతో నీకు ఎలా బాగుంటుంది అనిపిస్తే అలా చెయ్యి అని దర్శకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
దీంతో నవీన్ బాలిరెడ్డి పాత్ర కోసం ఆ విధంగా బీర్లు లాగించేసి మరి రెడీ అయ్యేవాడట. అదే విధంగా యాసపై పట్టు సాధించడానికి అలాగే హావభావాలు కూడా కరెక్ట్ గా ఉండాలని రాయలసీమ వెళ్లి మరి అక్కడి ప్రాంత వాసులను చూసి నేర్చుకున్నాడట.ఆ విధంగా కష్టపడ్డాడు కాబట్టే బాలి రెడ్డి పాత్రకు న్యాయం చేశాడని చెప్పవచ్చు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడిని మెప్పిస్తే మిగతా దర్శకులు కూడా అతనికి ఫిదా అయిపోతారని చెప్పవచ్చు. మరి ఇలాంటి అవకాశాలు నవీన్ చంద్ర ఇంకెన్ని అందుకుంటాడో చూడాలి.
సంబంధిత వార్తలు
అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!
త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్
అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!
అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!
అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)
తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!
యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత
'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!
