Asianet News TeluguAsianet News Telugu

నిహారిక జ్ఞాపకాలు పూర్తిగా చెరిపేసిన భర్త... ఆ ఒక్క ఫోటో మాత్రం ఎందుకు ఉంచాడు!

మెగా డాటర్ నిహారిక విడాకులు వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పెళ్లి ఫోటోలతో పాటు నిహారికతో కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేసిన వెంకట చైతన్య ఒక్క ఫోటో మాత్రం డిలీట్ చేయలేదు.
 

nagababu daughter niharika konidela husband venkata chaitanya jonnalagadda deletes marriage photos except one
Author
First Published Mar 20, 2023, 3:06 PM IST

మరో యంగ్ కపుల్ విడిపోతున్నారనేది తాజా వార్త. నటుడు నాగబాబు కూతురు నిహారికకు భర్తతో మనస్పర్థలు తలెత్తాయట. ఆధారాలు చూపుతూ ఈ మేరకు కథనాలు వెలువడుతున్నాయి. నిహారిక 2020 డిసెంబర్ 9వ తేదీన గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు. వెంకట చైతన్య తండ్రి ప్రభాకర్ రావు పోలీస్ అధికారి. ఆయనకు చిరంజీవి కుటుంబంతో చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఆ విధంగా సంబంధం కుదిరింది. 

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ నిహారిక వివాహానికి వేదికైంది. ఐదు రోజులు ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటు మెగా హీరోలందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. పెళ్ళికి కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం లభించింది. పరిశ్రమ ప్రముఖులను పిలవలేదు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ కి మాత్రం అందరినీ ఆహ్వానించారు. 

nagababu daughter niharika konidela husband venkata chaitanya jonnalagadda deletes marriage photos except one

నిహారికకు పెళ్ళై రెండేళ్లు దాటింది. వివాహం అనంతరం కూడా ఆమె నిహారిక యాక్టింగ్ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారట. అందుకు వెంకట చైతన్య కుటుంబ సభ్యులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సడన్ గా నిహారిక, వెంకట చైతన్య మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు పుకార్లు చెలరేగాయి. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు అన్ ఫాలో అయ్యారు. వెంకట చైతన్య పెళ్లి ఫొటోలతో పాటు నిహారికతో ఉన్న ఫోటోలు డిలీట్ చేశారు. ఇవి విడాకుల వార్తలకు దారితీశాయి. ఐతే నిహారిక పెళ్లి ఫోటోలు తన అకౌంట్ నుండి తొలగించలేదు.

అయితే వెంకట చైతన్య అకౌంట్ నుండి నిహారిక ఉన్న ఒక్క ఫోటో మాత్రం డిలీట్ చేయలేదు. ఆ ఒక్క ఫోటో ఎందుకు ఉంచాడనే సందేహాలు కలుగుతున్నాయి. వెంకట చైతన్య తన అకౌంట్లో ఉంచిన నిహారిక ఫోటోలో పెట్ డాగ్ ఉండటం మనం చూడొచ్చు. నిజంగా వెంకట చైతన్య, నిహారిక మధ్య గొడవలు నిజమైతే కారణాలు ఏమిటనే అన్వేషణ మొదలైంది. 

nagababu daughter niharika konidela husband venkata chaitanya jonnalagadda deletes marriage photos except one

ఈ రెండేళ్లలో నిహారిక కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. కొన్ని నెలలు ఇంస్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ చేసి సోషల్ మీడియాకు దూరమయ్యారు. తన జిమ్ ట్రైనర్ తో సన్నిహితంగా దిగిన ఫోటోలు షేర్ చేసిన నిహారిక అత్తింటివారి ఆగ్రహానికి గురైందని, వారు హెచ్చరించడంతో ఇంస్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అలాగే పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ లో జరుగుతున్న లేట్ నైట్ పార్టీపై అధికారులు దాడి చేయగా నిహారిక పట్టుబడ్డారు. ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించడం జరిగింది. విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Chaitanya Jv (@chaitanya_jv)

Follow Us:
Download App:
  • android
  • ios