Asianet News TeluguAsianet News Telugu

#RaviTeja:టైగర్ ...గోపిచంచ్ తో సినిమాని తినేస్తోందా?

నవంబర్ 23 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సిన రవితేజ కొత్త చిత్రానికి సైతం బ్రేక్ లు పడినట్లు వార్తలు వస్తున్నాయి.

Mythri puts Ravi Teja-Gopichand film on hold jsp
Author
First Published Nov 23, 2023, 6:38 AM IST

సినీ పరిశ్రమలో లెక్కలు ప్రతీ శుక్రవారం మారిపోతూంటాయి. మొత్తం సెట్ అయ్యిందనుకున్న ప్రాజెక్టు రకరకాల కారణాలతో వెనక్కి వెళ్ళచ్చు. అలాగే పెండింగ్ లో ఉన్న సినిమా....ఆ వారం రిలీజైన అదే జానర్ సూపర్ హిట్ అయ్యితే పట్టాలు ఎక్కేయచ్చు. లేదా ఆ హీరోకు సూపర్ హిట్ పడితే మొత్తం మారిపోతుంది. అంతా శుక్రవారం లెక్కలుపై ఆధారపడి ఉంటుంది.థమాకా సూపర్ హిట్ అవ్వటంతో అందరి దృష్టీ ఒక్కసారిగా రవితేజపై పడింది. పెద్ద బ్యానర్స్ రవితేజతో సినిమా చేయటానికి ప్లాన్ చేసుకున్నాయి. అయితే ఈ లోగా టైగర్ నాగేశ్వరరావు వచ్చి డిజాస్టర్ అయ్యింది.

ఎంతో నమ్మకంతో చేసిన ఈ సినిమా మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. అంతకు ముందు రావణాసుర చిత్రంది అదే పరిస్దితి. దాంతో రవితేజతో మొదలు కావాల్సిన ప్రాజెక్టులు పునరాలోచనలో పడుతున్నాయి.బడ్జెట్ కనుక ఎక్కువ అనుకుంటే ప్రక్కన పెట్టేస్తున్నాయి. నవంబర్ 23 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సిన రవితేజ కొత్త చిత్రానికి సైతం బ్రేక్ లు పడినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ సినిమాకి బ్రేకులు పడడానికి బడ్జెట్ సమస్యలే అంటున్నారు. రవితేజ ఫామ్ లో ఉన్నప్పుడు ఓకే అయ్యిన ప్రాజెక్టు ఇదని, ఇప్పుడు టైగర్ తర్వాత  అంతంత బడ్జెట్ అయితే వర్కవుట్ కాదని నిర్మాతలు మైత్రీవారు భావిస్తున్నారట.  మార్కెట్ లెక్కలకు సినిమాకి అనుకున్న బడ్జెట్ కి మధ్య  తేడా ఎక్కువ ఉండటంతో ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్లు చెబుతున్నారు. 

‘డాన్‌ శీను, బలుపు, క్రాక్‌’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా ఓ పవర్‌ఫుల్‌ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. కాగా ఈ సినిమాలోని కీలక పాత్రల్లో దర్శక–నటుడు సెల్వరాఘవన్, ఇందూజ రవిచంద్రన్‌ నటించనున్నట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జీకే విష్ణు.

 రవితేజ ప్రస్తుతం 'ఈగల్'(Eagle) మూవీలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల టీజర్ విడుదలై భారీ రెస్పాన్స్ అందుకుంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios