Asianet News TeluguAsianet News Telugu

అభిమానులకు చిరు బర్త్ డే ట్రీట్.. ‘భోళా శంకర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. గట్టి పోటీకి దిగుతున్న మెగాస్టార్.!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’ (Bhola Shankar). ఇంకా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.  
 

Megastar Chiranjeevi Bhola Shankar Movie Release date has arrived
Author
Hyderabad, First Published Aug 21, 2022, 3:39 PM IST


మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) - దర్శకుడు మెహర్ రమేశ్ కాంబినేషనల్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘భోళా శంకర్’. ‘ఆచార్య’తో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్ పైనా శ్రద్ధ వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే ‘గాడ్ ఫాదర్’ చిత్ర  షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నారు. మరోవైపు ‘భోళా శంకర్’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల్లోనూ ఏకకాలంలోనే నటిస్తున్నారు.  అయితే చిరు నటించిన చిత్రాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈమూవీ రిలీజ్ పైనా క్రేజీ అప్డేట్ అందింది. 

ఈ రోజు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా ‘భోళా శంకర్’ చిత్ర రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫిషీయల్ గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే వచ్చే ఏడాది భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2023 ఏప్రిల్ 28న సూపర్ స్టార్ మహేశ్ బాబు SSMB28 కూడా రిలీజ్ కానుంది. మరోవైపు బాలయ్య  ‘ఎన్బీకే 108’ను అదే నెలలో రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో చిరు గట్టి పోటీనిచ్చేందుకు బరిలోకి దిగుతుండటం విశేషం. ఏదేమైనా వచ్చే ఏడాది మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల విడుదలతో థియేటర్లలో సందడి నెలకొననుంది. 

చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రాన్ని చాలా తక్కువ సమయంలోనే పూర్తి  చేయాలని భావిస్తున్నారంట. అందుకే ఆలస్యం కాకుండా రెగ్యూలర్ షూటింగ్ ను శరవేగంగా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. తమిళ సినిమా ‘వేదాళం’కురీమేక్ గా ‘భోళా శంకర్’ రూపుదిద్దుకుంటోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ మరియు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్లపై  నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  హీరోయిన్ గా మిల్క్ బ్యూటీ తమన్నా (Tamannaah) చేయనుండగా,  చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios