మహేష్‌ బాబు తన అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశారు. తన సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించడం విశేషం. 

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు(Maheshbabu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా(SSMB28) వస్తుంది. చాలా గ్యాప్‌ తర్వాత ఈ కాంబో సెట్‌ అయ్యింది. చాలా రోజులుగా ఊరిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. మహేష్‌ ఫ్యాన్స్ ని ఖుషీ చేసే బిగ్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చేసింది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది యూనిట్‌. 

టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 28న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మహేష్‌ నటిస్తున్న 28వ చిత్రం కావడం, ఏప్రిల్‌ 28న విడుదల చేయడం విశేషం. మరోవైపు నాలుగు రోజుల లాంగ్‌ వీకెండ్ ఉండటం మరో విశేషం. అద్భుతమైన మెస్సీ లుక్‌, హై ఆక్టానే ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు. గ్రేట్‌ విట్‌నెస్‌ కోసం వేచి ఉండాలని తెలిపింది యూనిట్‌. 

ఈ చిత్రంలో మహేష్‌ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. `మహర్షి` చిత్రం తర్వాత మహేష్‌, పూజా మరోసారి కలిసి నటిస్తున్న చిత్రమిది. హారికా అండ్‌ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ లోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ క్లారిటీ రాలేదు. త్వరలోనే రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుందని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. సెప్టెంబర్‌ మొదటి వారంలో షూటింగ్‌ స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం.

Scroll to load tweet…

ఈ సినిమాకి జాతీయ అవార్డ్ గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా, అలాగే కళా దర్శకునిగా ఎ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రాహకుడు గా పి.ఎస్.వినోద్, సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టిస్తున్న తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన‌ ఎన్నో ఆసక్తికరమైన అంశాలు, మరిన్ని ఇతర వివరాలు త్వరలో మరో ప్రకటనలో తెలియ పరుస్తామని చిత్ర నిర్మాత ఎస్.రాధా కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు.