సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నుండి 'భరత్ అనే నేను' వరకు అమెరికాలో మహేష్ సినిమాల బిజినెస్ ఓ రేంజ్ లో జరిగింది.
ఇదే క్రేజ్ మహేష్ తాజా చిత్రం 'మహర్షి' విషయంలో కూడా రిపీట్ అవుతుందని ఆశించిన నిర్మాతలకు షాక్ తగిలింది. 'మహర్షి' డిస్ట్రిబ్యూషన్ హక్కులు కోసం నిర్మాతలు భారీ ధరలు చెప్పడంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు వెనుకడుగు వేస్తున్నారట.
ఓవర్సీస్ లో మహేష్ సినిమాల ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. 'శ్రీమంతుడు' తప్ప లాభాలు తెచ్చిన సినిమాలు చాలా తక్కువ. ఇతర సినిమాలు బాగా ఆడినా.. అధిక ధరలు పెట్టి సినిమాలను కొనడంతో పంపిణీదారులకు లాభాలు రాలేదని సమాచారం.
ఆ కారణంగానే ఇప్పుడు 'మహర్షి' సినిమా భారీ ధరలు పెట్టి కొనడానికి ఎవరూ రిస్క్ చేయడం లేదని తెలుస్తోంది. మరి నిర్మాతలు తము అనుకున్న మొత్తాన్ని తగ్గించి సినిమాను అమ్ముతారేమో చూడాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈగోలతో మహేష్ సినిమాకి ఇబ్బందులు!
మహేష్ సినిమా కంట్రోల్ దాటుతోందా..?
'మహర్షి' లో సాయికుమార్, 'అతడు' ని గుర్తు చేసేలా...?
'మహర్షి' సినిమాతో రిస్క్ లో పడతారా..?
మహేష్ సినిమాలో బాలయ్య హీరోయిన్!
'మహర్షి' షూటింగ్ లో హాట్ బ్యూటీ మిస్!
టాక్ ఆఫ్ ది టౌన్: అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్షిప్... సీక్రెట్ ఇదే
మహేష్.. దిల్ రాజు మాట వినడం లేదా..?
మహర్షి: మహేష్ లుక్ మాములుగా లేదు.. చంపేసాడు!
తప్పులో కాలేసిన హీరో మహేష్ బాబు
