Asianet News TeluguAsianet News Telugu

సుకుమార్ ని పక్కన పెట్టి 'ఎఫ్ 2' డైరెక్టర్ తో మహేష్!

ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమాను ఇప్పుడు అనీల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. నిజానికి ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ చేయాల్సివుంది. 

mahesh babu 26 film with anil ravipudi?
Author
Hyderabad, First Published Feb 13, 2019, 10:41 AM IST

ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమాను ఇప్పుడు అనీల్ రావిపూడి డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం. నిజానికి ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ చేయాల్సివుంది. కానీ ఇప్పుడు ఆయన్ని పక్కన పెట్టి మరీ అనీల్ రావిపూడికి ఛాన్స్ ఇస్తున్నాడట మహేష్.

ప్రస్తుతం 'మహర్షి' సినిమాలో నటిస్తోన్న మహేష్ తన తదుపరి సినిమా సుకుమార్ తో చేయాలనుకున్నాడు. సుకుమార్ చెప్పిన కథ కూడా మహేష్ ని ఆకట్టుకుంది. కానీ పూర్తి కథను సిద్ధం చేయడానికి సుకుమార్ మరో ఆరు నెలల సమయం కోరాడు. సుకుమార్ మీద నమ్మకంతో మహేష్ కూడా దానికి అంగీకరించాడు.

ఏప్రిల్ నాటికి మహేష్ ఖాళీ అయిపోతాడు. సుకుమార్ కథతో వచ్చేసరికి మరో సినిమా చేసే సమయం ఉంటుంది. దీంతో అనీల్ రావిపూడితో సెట్స్ పైకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడట. అనీల్ దగ్గర కథ కూడా సిద్ధంగా ఉంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న అనీల్ రావిపూడి రీసెంట్ గా 'ఎఫ్ 2' సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు.

ఇప్పుడు ఏకంగా మహేష్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడని అంటున్నారు. ఆరు నెలల్లో సినిమాను పూర్తి చేస్తానని అనీల్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తరువాత సుకుమార్ తో మహేష్ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios