Asianet News TeluguAsianet News Telugu

కబాలి 2 కి లైన్ క్లియర్

  • కబాలీ 2కి రంగం సిద్ధం
  • మూవీ టైటిల్ రిజిస్టర్ చేయించిన నిర్మాత
  • రజినీ అభిమానుల్లో ఆనందోత్సాహాలు
line clear for kabaali 2

2016 లో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం ఏదైనా ఉందంటే అది కబాలినే. కోలీవుడ్ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగ్ 600కోట్లు కొల్లగొట్టిందంట. ఫ్యాన్స్ ను అద్భుతంగా అలరించిన ఈ చిత్రం క్రిటిక్స్ ను మాత్రం మెప్పించలేకపోయింది. చాలా కాలంగా ఈ చిత్రానికి సంబంధించి సీక్వెల్ ఉంటుందనిప్రచారం సాగుతోంది. కాబలి రిలీజ్ అప్పుడు దర్శకనిర్మాతలు కబాలి 2 ఉంటుందని చెప్పారు. కానీ ఆ తర్వాత మాత్రం పెద్దగా రెస్పాన్డ్ అయింది లేదు.

కానీ ప్రస్తుతం కబాలి నిర్మాత కలైపులి థానూ.. కబాలి2 టైటిల్ రిజిస్టర్ చేయించాడు. దీంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. రజనీకాంత్ కబాలి2 ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ 1 కు దర్శకత్వం వహించిన పా. రంజిత్ పార్ట్ 2కి దర్శకత్వం వహిస్తాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.  రజనీకాంత్ ప్రస్తుతం రోబో 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.  ఈ ఏడాది చివర్లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి అవుతంది. ఆ తర్వాత రజనీకాంత్ కొత్త సినిమాకు సంబంధించిన క్లారిటీ వస్తుంది. అల్లుడు ధనుష్ బ్యానర్ లో రజనీకాంత్ చిత్రం చేస్తాననీ మాట ఇచ్చాడు. ఇప్పుడు రజనీకాంత్ ఏ సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios