బికినీలో అందాలు ఆరబోసేందుకు రెడీ అయిన లక్ష్మిరాయ్ హిందీలో జూలీ2 మూవీలో నటించిన రాయ్ లక్ష్మి జూలీ2లో బికినీలో పక్కాగా అలరిస్తానంటున్న భామ
మాంచి ఫిట్ నెస్ తో.. అందమైన రూపం లక్ష్మిరాయ్ సొంతం. అందాలను తెరపై కావలసినంతగా ఆరబోస్తూ.. ప్రేక్షకులకు కనువిందు చేసే కథానాయికలలో రాయ్ లక్ష్మీ కూడా ముందుంటుంది.
తెలుగులో ఆమె కొన్ని సినిమాలు చేసినా, ఆమె గ్లామర్ కి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. తమిళంలో మాత్రం ఫరవాలేదనిపించే స్థాయిలో సినిమాలు చేస్తూ వస్తోంది. ఆమె ప్రస్థుతం మెగాస్టార్ తో ఖైదీ నంబర్ 150లో స్పెషల్ సాంగ్ చేసింది.
స్పెషల్ సాంగ్ తో మెగా స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన రాయ్ లక్ష్మీ హిందీలో 'జూలీ 2' సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె బికినీలో కనిపిస్తుందట. తాను ఇంతవరకూ పక్కాగా బికినీ డ్రెస్ లో కనిపించలేదని చెప్పింది.
బికినీ డ్రెస్ లో పక్కాగా కనిపించే సినిమా 'జూలీ 2' అని అంటోంది. ఆ పాత్రను ఓ సవాలుగా తీసుకుని అలా కనిపించానని చెప్పింది. ఈ తరహాలో బికినీలో కనిపించడం నిజంగా ఒక ఛాలెంజ్ లాంటిదేనంటూ లక్ష్మి చెప్తోంటే, ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతోంది.
