MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే

Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే

Vijayakanth: కెప్టెన్ విజయకాంత్, నటుడు విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా ఏంటి? ఆ స్టోరీ ఏంటో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 25 2026, 09:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జీతం తీసుకోకుండా నటించిన విజయకాంత్
Image Credit : Facebook

జీతం తీసుకోకుండా నటించిన విజయకాంత్

1979లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విజయకాంత్, మూడు దశాబ్దాలకు పైగా తమిళ సినిమాల్లో ప్రయాణించి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. మధురైకి చెందిన ఆయన, సినిమాపై ఆసక్తితో చెన్నైకి వచ్చినప్పుడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మొదట్లో విలన్ పాత్రలు చేసినా, ఆ తర్వాత బలమైన కథలను ఎంచుకుని హీరోగా ఎదిగారు. ముఖ్యంగా 'సట్టం ఒరు ఇరుట్టరై' లాంటి సినిమాలు ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాజకీయాల్లో ముద్ర వేసిన విజయకాంత్
Image Credit : Facebook

రాజకీయాల్లో ముద్ర వేసిన విజయకాంత్

యాక్షన్ కథలకే పరిమితం కాకుండా, కుటుంబ బంధాలు, సెంటిమెంట్ కథల్లోనూ నటించిన విజయకాంత్, అన్ని వర్గాల అభిమానులను ఆకట్టుకున్నారు. ఆయన సినిమాల్లో సామాజిక స్పృహ, నిజాయితీ, ధైర్యం వంటి అంశాలు తరచుగా కనిపించేవి. సినిమాల్లో వచ్చిన పేరును రాజకీయాల్లోనూ ఉపయోగించుకున్న విజయకాంత్, డీఎండీకే (DMDK) పార్టీని స్థాపించి తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఓ మార్గాన్ని సృష్టించుకున్నారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే ఆయన, రాజకీయాల్లోనూ తనదైన శైలితో అందరి దృష్టిని ఆకర్షించారు.
34
కరుప్పు ఎంజీఆర్
Image Credit : Asianet News

కరుప్పు ఎంజీఆర్

తన ఆఫీస్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ అరటి ఆకులో భోజనం పెట్టి పేదల ఆకలి తీర్చారు విజయకాంత్. దివంగత మాజీ సీఎం ఎంజీఆర్ లాగే ఈయన కూడా పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. అందుకే ఆయన్ను 'కరుప్పు ఎంజీఆర్' (నల్ల ఎంజీఆర్) అని కూడా పిలిచేవారు. అభిమానులు ఆయన్ను 'పురట్చి కలైంజ్ఞర్' (విప్లవ కళాకారుడు), 'కెప్టెన్' వంటి పేర్లతో ప్రేమగా పిలుచుకునేవారు.

44
విజయ్ కోసం జీతం తీసుకోకుండా నటించిన విజయకాంత్
Image Credit : x

విజయ్ కోసం జీతం తీసుకోకుండా నటించిన విజయకాంత్

విజయకాంత్ కెరీర్‌లో డైరెక్టర్ ఎస్.ఏ. చంద్రశేఖర్‌తో ఉన్న స్నేహాన్ని ఎవరూ మర్చిపోలేరు. 1993లో, తన కొడుకు విజయ్‌ను హీరోగా పెట్టి ఎస్.ఏ. చంద్రశేఖర్ 'సెందూరపాండి' అనే సినిమా తీశారు. విజయ్ సినీ ఎదుగుదలకు ఈ సినిమా చాలా కీలకంగా నిలిచింది. ఇందులో ఓ ముఖ్య పాత్రలో నటించిన విజయకాంత్, తన విజయానికి కారణమైన దర్శకుడి కొడుకు విజయ్‌కు అండగా నిలిచారు. ఆ సినిమాలో నటించినందుకు విజయకాంత్ రెమ్యునరేషన్ తీసుకోలేదని ఎస్.ఏ. చంద్రశేఖర్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇది విజయకాంత్ గొప్ప మనసును నిదర్శనంగా నిలిచింది. ఇలా ఎన్నో విషయాల్లో విజయకాంత్‌ తన గొప్ప మనసుని చాటి చెప్పారు. తమిళనాడు ప్రజల గుండెల్లో ఉండిపోయారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Singer: ఓజీ ఫైర్‌ స్ట్రోమ్‌ సింగర్‌ కొత్త పాట చూశారా?.. ఊపేస్తున్న `ఓఎంజీ` సాంగ్‌
Recommended image2
Thudakkam: సైకోని ఒక ఆట ఆడుకున్న మోహన్ లాల్ కూతురు, ప్లాన్ చేసి మరీ కొట్టింది.. ఓటీటీలో దుమ్ములేపుతున్న మూవీ
Recommended image3
Venkatesh Remuneration: ఆదర్శ కుటుంబం మూవీకి వెంకటేష్‌ ఊహించని రెమ్యూనరేషన్‌.. ఏకంగా 3 రెట్లు ఎక్కువ
Related Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved