హీరో చనిపోయినా కూడా సినిమాను పూర్తి చేసిన ఘనత ఇండియాలో కోడి రామ కృష్ణ గారికే చెందుతుంది. గ్రాఫిక్స్ టీమ్ ను సెట్ చేసుకొని మళ్ళి తెరపై హీరోను ప్రతిష్టించాడు. ఆ దెబ్బతో ఇండియన్ సినిమా ప్రముఖులు అందరూ షాక్ అయ్యారు. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. కోడి రామకృష్ణ చివరగా చేసిన చిత్రం నగరహవు. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో నాగాభరణం పేరుతో రిలీజయింది. అసలైతే 1972లోనే కన్నడ హీరో విష్ణువర్ధన్ హీరోగా ఈ సినిమా కథ పుట్టింది.  మరోసారి 2016లో సినిమాను తీసి అందులో విష్ణు వర్ధన్ పాత్రను vfx తో క్రియేట్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. 2009లోనే విష్ణు వర్ధన్ చనిపోయాడు. 

అయితే అందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం యాక్షన్ సన్నివేశాల్లో విష్ణు వర్ధన్ ని చూపించిన విధానం ఒక వండర్ అని చెప్పాలి. ఈ విధంగా చేయవచ్చు అని అందరికి తెలిసినప్పటికీ మొదటగా దాన్ని ఆచరణలో పెట్టిన ఇండియన్ దర్శకుడు కోడి రామకృష్ణ.

కన్నడ స్టార్ హీరోను మళ్లీ తెర మీద చూపించడానికి రెండేళ్ల పాటు మకుట గ్రాఫిక్స్ కంపెనీతో ఏడు దేశాలకు చెందిన 576 మంది గ్రాఫిక్స్ నిపుణులతో కోడి రామకృష్ణ చాలా శ్రమించారు. 120 అడుగుల శివ నాగ రూపాన్ని కూడా మొదటిసారి ఈ సినిమాలోనే చూపించారు.  

ఇక నాగరహవు సినిమా 2016లో ప్రేక్షకుల ముందుకు వచ్చి కన్నడ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇండియాలో మొదటిసారి చనిపోయిన హీరోని తెరపై చూపించి మర్చిపోలేని ఘనత సాధించిన దర్శకుడు ఒక తెలుగు డైరక్టర్ అవ్వడం చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా కోరుకుందాం. 

అంజి దెబ్బ.. అరుంధతితో ఆ నిర్మాతను బ్రతికించాడు!

కోడి రామకృష్ణ.. పర్ఫెక్ట్ ఆల్ రౌండర్

రేపు జూబ్లీహిల్స్ లో కోడిరామకృష్ణ అంత్యక్రియలు!

దాసరితో కోడి రామకృష్ణ అనుబంధం!

కోడి రామకృష్ణ మృతిపై చంద్రబాబు సంతాపం!

కోడి రామకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాలు!

కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత!