ప్రముఖ టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతాకలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేశారు. వెంటిలేటర్ మీద ఆయనకి చికిత్స అందించారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన ఆయన 1982లో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ ఆ తరువాత టాలీవుడ్ ఎన్నో భారీ చిత్రాలను రూపొందించారు. ఆయన రూపొందించిన 'అమ్మోరు','అరుందతి' చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు.

దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కెరీర్ ఆరంభంలో కొన్ని చిత్రాల్లో నటించారు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఏళ్లుగా కెరీర్ ని  కొనసాగిస్తున్నారు.