దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావుకి టాలీవుడ్ లో ఎందఱో శిష్యులు ఉన్నారు. వారిలో కోడి రామకృష్ణ ఒకరు. అతడికి కూడా గురువు గారిపై విపరీతమైన అభిమానం ఉండేది. ఓసారి దాసరితో ఉన్న అనుబంధం గురించి ఇంటర్వ్యూలో చెప్పాడు కోడిరామకృష్ణ.

చిన్నప్పుడు అర్దరాత్రి నాటకాలు వేయడాలు, గోడ దూకి పారిపోవడాలు వంటివి చేసేవారట కోడి రామకృష్ణ. అసలు అతడు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారట. కానీ దాసరి నారాయణరావు 'తాతా మనవడు' సినిమా చూసి డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నారట కోడి రామకృష్ణ. దర్శకుడిగా అయితే ఎన్నో కథలు చెప్పొచ్చని అనుకున్నారట.

దీంతో దాసరి గారు కలిసినప్పుడు 'మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్ గా అవకాశం ఇవ్వండి సర్'అంటూ బతిమాలుకున్నారట. దీంతో దాసరి బీకాం పూర్తి చెయ్ ఆ తరువాత చూద్దామని చెప్పడంతో చదువు పూర్తి చేశారట కోడిరామకృష్ణ. ఆ తరువాత దాసరి నుండి కోడి రామకృష్ణకి 'స్టార్ట్ ఇమీడియట్లీ' అంటూ టెలిగ్రాం రావడంతో మద్రాస్ కి వెళ్లారు కోడి రామకృష్ణ.

అక్కడ తన కొడుకు కంటే దాసరి ఎక్కువగా చూసుకున్నారని, దర్శకుడిగా అవకాశం ఇచ్చారని ఆయన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనని కోడి రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.  

కోడి రామకృష్ణ మృతిపై చంద్రబాబు సంతాపం!

కోడి రామకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాలు!

కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత!