ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోడి రామకృష్ణ తన కెరీర్ లో గ్రామీణ, కుటుంబ నేపధ్యంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారని గుర్తు చేసుకున్నారు.

కోడిరామకృష్ణ మృతి చిత్ర పరిశ్రమకి తీరని లోటని అన్నారు. కోడి రామకృష్ణ కుటుంబానికి తన సంతాపం వ్యక్తం చేశారు. అలానే కోడి రామకృష్ణ మృతిపట్ల తెలుగు సినిమా నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది.

గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్న కోడి రామకృష్ణ ఈరోజు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. తన కెరీర్ లో వందకు పైగా చిత్రాలను డైరెక్ట్ చేసిన ఘనత ఆయన సొంతం. 

కోడి రామకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాలు!

కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత!