టాలీవుడ్ లో అరుంధతి సినిమా ఎలాంటి బాక్స్ ఆఫీస్ హిట్ ను అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ఆ సినిమాను నిర్మించిన మెల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి అంతకుముందు అంజి సినిమాతో కోలుకోలేని దెబ్బ తిన్నారు. కోడి రామ కృష్ణ దర్శకత్వం వహించిన అంజి సినిమా నిర్మాతను దారుణంగా ముంచేసింది. 28కోట్లతో నిర్మించిన ఆ సినిమా కనీసం పెట్టుబడిని కూడా వెనక్కి తేలేదు. 

అమ్మోరు సినిమా హిట్టవ్వాగానే కోడి రామకృష్ణ దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు 1997లో ఎనౌన్స్ చేశారు. అయితే సినిమా హెవి గ్రాఫిక్స్ వల్ల బడ్జెట్ ను అడ్జస్ట్ చేయలేకపోయారు. వాయిదాల మీద వాయిదాలు పడుతూ 1997 స్టార్ట్ అయిన సినిమా 2004లో రీలీజయ్యింది. లెట్ గా వచ్చిందని జనాలు ఎవరు పట్టించుకోలేదు. ఆ దెబ్బతో నిర్మాత నిండా అప్పుల బారిన పడ్డారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డికి కోడి రామకృష్ణ అంటే అమితమైన నమ్మకం.  

ఇక మళ్ళి ఎలాగైనా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి హిట్టివ్వాలని కొడి రామ కృష్ణ తీవ్ర ప్రయత్నాలు చేసి ఆయన సలహా మేరకే 2009లో అరుంధతి సినిమా ద్వారా లైఫ్ సెటిల్ చేశారు . ఆ తరువాతే ఆయన జబర్దస్త్ వంటి షోలను కొనసాగిస్తూ సేఫ్ జోన్ లో ఆదాయాన్ని అందుకుంటున్నారు. అరుంధతి సినిమా అప్పట్లో 30 కోట్లకు పైగా లాభాలను అందించినట్లు సమాచారం . 

ఆ సినిమా కోసం  20 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టిన శ్యామ్ ప్రసాద్ గారు తన ఆస్తులను పణంగా పెట్టి డబ్బింగ్ పనులు జరిగే సమయంలో ఆటోలో ప్రయాణించేవారు. ఆ సినిమా హిట్టవ్వడంతో కోడి రామకృష్ణ అందరికంటే ఎక్కువ సంతోషించారు. అనుష్క కెరీర్ ను కూడా ఆ ఒక్క సినిమా మలుపు తిప్పింది. కోడి రామ కృష్ణ కెరీర్ లో అరుంధతి ది బెస్ట్ అండ్ లక్కీ సినిమా. 

కోడి రామకృష్ణ.. పర్ఫెక్ట్ ఆల్ రౌండర్

రేపు జూబ్లీహిల్స్ లో కోడిరామకృష్ణ అంత్యక్రియలు!

దాసరితో కోడి రామకృష్ణ అనుబంధం!

కోడి రామకృష్ణ మృతిపై చంద్రబాబు సంతాపం!

కోడి రామకృష్ణ కెరీర్ లో మరపురాని చిత్రాలు!

కోడి రామకృష్ణ తలకి గుడ్డ ఎందుకు కట్టుకుంటారంటే..?

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత!