Asianet News TeluguAsianet News Telugu

కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లిలో క్రేజీ విజువల్స్..సాంప్రదాయ పద్దతిలో వేడుక, వైరల్ వీడియో

కిరణ్ అబ్బవరం. రహస్య వధూవరులుగా ముస్తాబై పెళ్లి మండపానికి వెళుతున్నారు. దీనితో బంధు మిత్రులు వారిని సాంప్రదాయ పద్దతిలో మండపం వద్దకు తీసుకుని వెళుతున్నారు.

Kiran Abbavaram and Rahasya marriage video goes viral dtr
Author
First Published Aug 22, 2024, 10:38 PM IST | Last Updated Aug 22, 2024, 10:38 PM IST

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గుర్తింపు అయితే వచ్చింది కానీ సక్సెస్ దక్కడం లేదు. సక్సెస్ కోసం కిరణ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ 'క' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కిరణ్ అబ్బవరం ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నాడు. 

రాజావారు రాణిగారు అనే చిత్రంతో కిరణ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన రహస్య గోరఖ్ నే రియల్ లైఫ్ లో కిరణ్ అబ్బవరం తన జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. వీళ్లిద్దరి పెళ్లి వేడుక గురువారం రోజు కర్ణాటక లోని కూర్గ్ లో ఘనంగా జరిగింది. 

 

పెళ్లి వేడుక నుంచి కొన్ని ఎక్స్ క్లూజివ్ విజువల్స్ వచ్చాయి. కిరణ్ అబ్బవరం. రహస్య వధూవరులుగా ముస్తాబై పెళ్లి మండపానికి వెళుతున్నారు. దీనితో బంధు మిత్రులు వారిని సాంప్రదాయ పద్దతిలో మండపం వద్దకు తీసుకుని వెళుతున్నారు. కిరణ్ అబ్బవరం సాంప్రదాయ పంచె కట్టులో కనిపిస్తున్నాడు. ఇక రహస్య గోరఖ్ అయితే పట్టు చీరలో వెలిగిపోతోంది. ఈ విజువల్స్ చూడ ముచ్చటగా ఉన్నాయి. 

మొత్తంగా యువ హీరో కిరణ్ అబ్బవరం ఓ ఇంటివాడయ్యాడు. సాఫ్ట్ వేర్ జాబ్ ని వదిలిపెట్టి కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios